తెలంగాణ

telangana

ETV Bharat / sports

IND vs WI: యువ ఆటగాళ్లు షారుక్, సాయి కిశోర్​కు బంపర్ ఆఫర్ - టీమ్​ఇండియా స్క్వాడ్

IND vs WI Series: స్వదేశంలో వెస్టిండీస్​తో సిరీస్​లో భాగంగా యువ ఆటగాళ్లు షారుక్ ఖాన్, సాయి కిషోర్​లు బంపర్ ఆఫర్​ కొట్టేశారు. టీమ్​ఇండియాలో స్టాండ్​-బై ప్లేయర్లుగా ఎంపికయ్యారు.

shahrukh khan
షారుక్ ఖాన్

By

Published : Jan 30, 2022, 8:47 PM IST

IND vs WI Series: భారత్​ వేదికగా వెస్టిండీస్​తో సిరీస్​ నేపథ్యంలో ఇప్పటికే టీమ్​ఇండియా స్క్వాడ్​ను ప్రకటించింది భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ). తాజాగా మరో ఇద్దరు ఆటగాళ్లను జట్టులోకి ఎంపిక చేసింది. తమిళనాడు యువ ఆటగాళ్లు షారుక్ ఖాన్, సాయి కిశోర్​లను స్టాండ్​బై ప్లేయర్లుగా ప్రకటించింది.

"వెస్టిండీస్​తో సిరీస్​లో భాగంగా షారుక్ ఖాన్, సాయి కిశోర్​లను స్టాండ్​-బై ఆటగాళ్లుగా జట్టులోకి తీసుకున్నారు. వారు త్వరలోనే బయోబబుల్​లోకి అడుగుపెట్టనున్నారు." అని తమిళనాడు క్రికెట్ అసోసియేషన్ తెలిపింది.

బీసీసీఐ ప్రకటన నేపథ్యంలో యువ ఆటగాళ్లు షారుక్, సాయి.. రంజీ ట్రోఫీ తొలి దశలో కొన్ని మ్యాచ్​లకు దూరంకానున్నారు. అయితే.. ఇటీవలే రంజీ ట్రోఫీని రెండు దశల్లో నిర్వహించనున్నట్లు బీసీసీఐ సెక్రటరీ జై షా స్పష్టం చేశారు. తొలి దశలో లీగ్​ స్టేజ్​ మ్యాచ్​లు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.

టీమ్​ఇండియా స్క్వాడ్:

వన్డే జట్టు: రోహిత్ శర్మ(కెప్టెన్), కేఎల్ రాహుల్(వైస్ కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్, శిఖర్ ధావన్, విరాట్ కోహ్లీ, సూర్య కుమార్ యాదవ్, శ్రేయస్ అయ్యర్, దీపక్ హూడా, రిషభ్ పంత్(వికెట్ కీపర్), దీపక్ చహర్, శార్దూల్ ఠాకూర్, యుజ్వేంద్ర చాహల్, కుల్​దీప్ యాదవ్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ క్రిష్ణ, ఆవేశ్ ఖాన్.

టీ20 జట్టు: రోహిత్ శర్మ(కెప్టెన్), కేఎల్ రాహుల్(వైస్ కెప్టెన్), ఇషాన్ కిషన్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, సూర్య కుమార్ యాదవ్, రిషభ్ పంత్(వికెట్ కీపర్), వెంకటేష్ అయ్యర్, దీపక్ చహర్, శార్దూల్ ఠాకూర్, రవి బిష్ణోయ్, అక్షర్ పటేల్, యుజ్వేంద్ర చాహల్, వాషింగ్టన్ సుందర్, మహ్మద్ సిరాజ్, భువనేశ్వర్ కుమార్, ఆవేశ్ ఖాన్, హర్షల్ పటేల్

స్టాండ్​-బై:షారుక్ ఖాన్, సాయి కిశోర్.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

ఇదీ చదవండి:

గంభీర్‌తో వివాదంపై స్పందించిన పాక్ మాజీ అటగాడు అక్మల్

Australian Open 2022: రఫేల్​దే టైటిల్.. పోరాడి ఓడిన మెద్వెదెవ్

ABOUT THE AUTHOR

...view details