IND vs WI: వికెట్‌కీపర్ బ్యాట్స్‌మన్ రిషబ్ పంత్ వెస్టిండీస్‌తో టీ20 సిరీస్‌కు భారత జట్టు వైస్ కెప్టెన్‌గా నియమితుడయ్యాడు. రాహుల్ గైర్హాజరీలో పంత్‌కు వైస్ కెప్టెన్సీ దక్కింది.
ఆఫ్‌స్పిన్నర్ వాషింగ్టన్ సుందర్ తొడకండరాల గాయం కారణంగా ఈ సిరీస్‌కు దూరమయ్యాడు. విండీస్‌తో మూడో వన్డే సందర్భంగా అతడు గాయపడ్డట్లు బీసీసీఐ తెలిపింది. అతడి స్థానంలో కుల్‌దీప్ యాదవ్ జట్టులో స్థానం సంపాదించాడు. కేఎల్ రాహుల్, అక్షర్ పటేల్ గాయాలతో ఇప్పటికే సిరీస్‌కు దూరమయ్యారు. వారి స్థానాల్లో రుతురాజ్ గైక్వాడ్, దీపక్ హూడాకు అవకాశమివ్వనున్నట్లు తెలిపింది బీసీసీఐ.