IND VS WI Deepak chahar injured: వెస్టిండీస్‌తో తొలి టీ20లో ఫాస్ట్‌బౌలర్ దీపక్ చాహర్ గాయపడ్డాడు. విండీస్ కెప్టెన్ పొలార్డ్ స్క్వేర్ లెగ్‌లోకి బలంగా కొట్టిన బంతిని ఆపే ప్రయత్నంలో అతడికి గాయమైంది. విండీస్ ఇన్నింగ్స్ 19వ ఓవర్లో ఇది జరిగింది. చాహర్ వెంటనే మైదానాన్ని వీడాడు. తన కోటా ఓవర్లను అతడు పూర్తి చేయలేకపోయాడు. ఆఖరి ఓవర్లో హర్షల్ పటేల్ బౌలింగ్ చేయాల్సి వచ్చింది. చాహర్ 3 మూడు ఓవర్లలో 28 పరుగులిచ్చి ఒక వికెట్ పడగొట్టాడు.
IND VS WI: దీపక్ చాహర్, వెంకటేశ్ అయ్యర్‌కు గాయాలు
IND VS WI Deepak chahar injured: వెస్టిండీస్‌తో జరిగిన తొలి టీ20లో ఫాస్ట్ బౌలర్ దీపక్ చాహర్, వెంకటేశ్ అయ్యర్ గాయపడ్డారు. ప్రస్తుతం వీరిద్దరికి చికిత్స అందిస్తున్నారు. మరి రెండో టీ20కు వీరు అందుబాటులో ఉంటారో లేదో చూడాలి.
దీపక్ చాహర్, వెంకటేశ్ అయ్యర్‌కు గాయం
అంతకుముందు 17వ ఓవర్లో ఫీల్డింగ్ చేస్తూ వెంకటేశ్ అయ్యర్ కూడా గాయపడ్డాడు. అయితే ఛేదనలో వెంకటేశ్ బ్యాటింగ్‌కు వచ్చాడు. ప్రస్తుతం వీరిద్దరికీ చికిత్స అందిస్తున్నారు. మరి రెండో టీ20కు వీరు అందుబాటులో ఉంటారో లేదో చూడాలి. కాగా ఐపీఎల్ మెగావేలంలో చాహర్‌ను రూ.14కోట్లకు సొంతం చేసుకుంది చెన్నై సూపర్ కింగ్స్.
ఇదీ చూడండి: టీమ్ఇండియా గెలుపు.. తొలి టీ20లో విండీస్‌పై విక్టరీ
Last Updated : Feb 17, 2022, 9:28 AM IST