Rohit Sharma: మరో అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ. బెంగళూరు వేదికగా మార్చి 12 నుంచి శ్రీలంకతో టీమ్‌ఇండియా రెండో టెస్టు (డే/నైట్) ఆడనుంది. ఈ మ్యాచ్‌కు పింక్ బాల్(గులాబీ బంతి)ని ఉపయోగించనున్నారు. కాగా, ఇది రోహిత్ శర్మకు 400వ అంతర్జాతీయ మ్యాచ్. ఈ ఘనత సాధించిన 35వ అంతర్జాతీయ క్రికెటర్‌గా, 9వ భారత క్రికెటర్‌గా రికార్డుల్లోకెక్కనున్నాడు రోహిత్.
భారత క్రికెట్ దిగ్గజం, 'గాడ్ ఆఫ్ క్రికెట్' సచిన్ టెందూల్కర్ 664 అంతర్జాతీయ మ్యాచ్‌లతో ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉన్నారు. శ్రీలంక మాజీ ఆటగాళ్లు మహేల జయవర్ధనే (652), కుమార సంగక్కర (594), సనత్ జయసూర్య (586) వరుసగా తర్వాతి స్థానాల్లో ఉన్నారు.