శ్రీలంకతో జరుగుతున్న మూడో వన్డేలో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత జట్టు స్వల్ప స్కోరుకే పరిమితమైంది. లంక స్పిన్నర్లు అఖిల ధనంజయ 3/44, జయవిక్రమ 3/59 చెలరేగడం వల్ల భారత్ 43.1 ఓవర్లలో 225 పరుగులకే ఆలౌటైంది. దాంతో ఆతిథ్య జట్టుకు 226 పరుగులు లక్ష్యాన్ని నిర్దేశించింది ధావన్ సేన.
తేలిపోయిన భారత బ్యాట్స్‌మెన్.. శ్రీలంక లక్ష్యం 226 - పృథ్వీషా
శ్రీలంకతో జరుగుతోన్న మూడో వన్డేలో 225 పరుగులకే టీమ్ఇండియా ఆలౌట్ అయ్యింది. లంక బౌలర్ల ధాటికి 43.1 ఓవర్లకే కుప్పకూలిపోయింది ధావన్ సేన. ఫలితంగా శ్రీలంక జట్టు ఎదుట 226 రన్స్ లక్ష్యాన్ని టీమ్ఇండియా నిర్దేశించింది.
భారత్ Vs శ్రీలంక మూడో వన్డే
టీమ్ఇండియా తొలి ఇన్నింగ్స్ సందర్భంగా వర్షం కురవడంతో మ్యాచ్‌ను 47 ఓవర్లకు కుదించారు. భారత బ్యాట్స్‌మెన్‌లో పృథ్వీ షా (49), సంజూ శాంసన్ (46), సూర్యకుమార్ యాదవ్ (40) ఫర్వాలేదనిపించారు. చివర్లో రాహుల్ చాహర్ (13), నవ్‌దీప్ సైనీ (15) తొమ్మిదో వికెట్‌కు 29 పరుగుల కీలక భాగస్వామ్యం నెలకొల్పారు. ఫలితంగా స్కోరు 200 దాటింది.
ఇదీ చూడండి..భారత్-శ్రీలంక చివరి వన్డేకు వరుణుడి ఆటంకం
Last Updated : Jul 23, 2021, 8:53 PM IST