IND vs SA Test: దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్ ఆడేందుకు టీమ్ఇండియా సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో భారత జట్టు ఓపెనర్ కేఎల్ రాహుల్ వైస్ కెప్టెన్ బాధ్యతలు స్వీకరించనున్నాడు. గాయం కారణంగా రోహిత్ శర్మ టెస్టు సిరీస్కు దూరమైన నేపథ్యంలో రాహుల్కు కీలక బాధ్యతలు అప్పగించింది భారత క్రికెట్ నియంత్రణ మండలి.
సొంతగడ్డపై న్యూజిలాండ్తో సిరీస్ అనంతరం అజింక్య రహానెను టెస్టు జట్టు వైస్ కెప్టెన్గా తొలగించింది బీసీసీఐ. టెస్టు జట్టుకు వైస్ కెప్టెన్గా, వన్డే జట్టుకు కెప్టెన్గా రోహిత్ శర్మను నియమిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. అయితే.. హిట్మ్యాన్ టెస్టు సిరీస్కు దూరమైన కారణంగా రాహుల్ వైస్ కెప్టెన్ బాధ్యతలు చేపట్టాల్సి వచ్చింది.
మూడు మ్యాచ్ల టెస్టు సిరీస్కు రోహిత్ దూరమవుతున్నట్లు ప్రకటించిన బీసీసీఐ.. అతడి స్థానంలో ప్రియాంక్ పంచాల్కు చోటు కల్పించింది. ప్రస్తుతం హిట్మ్యాన్ ఎన్సీఏలో ఉండి ఫిట్నెస్పై దృష్టి పెట్టాడు.
సఫారీలతో తొలి టెస్టు డిసెంబర్ 26న ప్రారంభం కానుంది. ఈమేరకు భారత జట్టు రెండు రోజుల క్రితమే దక్షిణాఫ్రికాకు చేరుకుంది.