తెలంగాణ

telangana

ETV Bharat / sports

ఐపీఎల్​ తర్వాత మరో రసవత్తర సిరీస్​కు టీమ్​ఇండియా రెడీ - southafrica tour

Ind vs sa t20 series: భారత్​-దక్షిణాఫ్రికా టీ20 సిరీస్​ ఖరారైంది. ఐపీఎల్​ ముగిసిన పది రోజుల తర్వాత ఈ సిరీస్​ ప్రారంభం కానుంది. టోర్నీలో భాగంగా ఐదు టీ20లు ఆడనుంది టీమ్​ఇండియా. జూన్​ 6 నుంచి 19 వరకు ఈ సిరీస్​ జరగనుంది.

t20 series
indian team

By

Published : Mar 3, 2022, 12:43 PM IST

Ind vs sa t20 series: భారత్​తో దక్షిణాఫ్రికా​ టీ20 సిరీస్​ ఖరారైంది. ఐపీఎల్​ సీజన్​ ముగిశాక జూన్​లో భారత్​కు దక్షిణాఫ్రికా జట్టు రానుంది. ఈ పర్యటనలో భాగంగా టీమ్​ఇండియాతో ఐదు టీ20 మ్యాచ్​లు ఆడనుంది. జూన్ 6 నుంచి 19 వరకు సిరీస్​ జరగనున్నట్లు తెలుస్తోంది. కటక్​, వైజాగ్​, దిల్లీ, రాజ్​కోట్​, చెన్నైలో మ్యాచులు జరుగుతాయని సమాచారం.

మార్చి 26 నుంచి మే 29 వరకు ముంబై, పుణెల్లో ఐపీఎల్‌ జరగనుంది. ఈ టోర్నీ ముగిసిన 10 రోజుల తర్వాత దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్‌ ప్రారంభం కానుంది. ఈ సిరీస్‌ ఫ్యూచర్ టూర్స్ ప్రోగ్రామ్ (ఎఫ్‌టీపీ)లో భాగమని బీసీసీఐ అధికారి తెలిపారు. అయితే ఈ పర్యటన ముగిశాక టీమ్​ఇండియా ఇంగ్లండ్‌కు వెళ్లనుంది. గత ఏడాది టెస్టు సిరీస్‌లో మిగిలిన నాలుగో టెస్టును భారత్‌ ఆడనుంది. ఈ సిరీస్​లో 2-1తో ఆధిక్యంలో ఉంది.

ఈ ఏడాది జూన్​ 26, 28 తేదీల్లో మలహైడ్​ వేదికగా ఐర్లాండ్​ జట్టుతో రెండు టీ20లు ఆడనుంది టీమ్​ఇండియా. అయితే ఈ పర్యటనలో సీనియర్లకు విశ్రాంతినిచ్చి టీమ్​ ఇండియా యువ జట్టును పంపనుంది బీసీసీఐ.

ఇదీ చదవండి: నాలుగేళ్ల తర్వాత ఐర్లాండ్ టూర్​కు టీమ్​ఇండియా- రోహిత్, కోహ్లీ దూరం!

ABOUT THE AUTHOR

...view details