Anrich Nortje Injury: టీమ్ఇండియాతో టెస్టు సిరీస్‌కు ముందు దక్షిణాఫ్రికాకు షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ పేసర్ ఎన్రిచ్ నోర్ట్జే గాయం కారణంగా ఈ సిరీస్‌కు దూరమయ్యాడు. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది సౌాాతాఫ్రికా క్రికెట్ బోర్డు. కానీ అతడికి రిప్లేస్మెంట్ను మాత్రం ప్రకటించలేదు.
IND vs SA Series: టెస్టు సిరీస్ నుంచి సౌతాఫ్రికా స్టార్ పేసర్ ఔట్ - ఎన్రిచ్ నోర్జ్టే ఔట్
Anrich Nortje Injury: టీమ్ఇండియాతో టెస్టు సిరీస్‌కు ముందు దక్షిణాఫ్రికా జట్టుకు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు స్టార్ పేసర్ ఎన్రిచ్ నోర్జ్టే గాయం కారణంగా ఈ సిరీస్‌కు దూరమయ్యాడు.
రెండేళ్లుగా జట్టు విజయాల్లో కీలకపాత్ర పోషిస్తున్నాడు ఎన్రిచ్. ప్రతి మ్యాచ్‌లోనూ వికెట్లు తీస్తూ స్టార్ పేసర్‌గా ఎదిగాడు. ఇప్పుడు టీమ్ఇండియాతో టెస్టు సిరీస్‌కు అతడు దూరమవడం జట్టుకు పెద్ద లోటని చెప్పవచ్చు. వన్డే సిరీస్ వరకైనా అతడు కోలుకోవాలని జట్టు ఆశిస్తోంది.
India vs SA Series: భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య డిసెంబర్ 26 (బాక్సింగ్ డే) నుంచి తొలి టెస్టు ప్రారంభమవుతుంది. రెండో టెస్టు జనవరి 03-07, ఆఖరి టెస్టు జనవరి 11-15 వరకు జరుగుతుంది. జనవరి 19, 21, 23వ తేదీల్లో మూడు వన్డేలు జరుగుతాయి.