Ind vs SA 3rd Test: టీమ్ఇండియాతో సిరీస్ డిసైడర్ మ్యాచ్ కోసం సిద్ధంగా ఉన్నట్లు చెప్పాడు దక్షిణాఫ్రికా సారథి డీన్ ఎల్గర్. భారత జట్టులోకి కెప్టెన్ విరాట్ కోహ్లీ తిరిగిరావడం వల్ల ఈ టెస్టు.. గత 10-15ఏళ్లలో జరిగే అత్యంత తీవ్రమైన పోరుగా మారనుందని చెప్పాడు.
"విరాట్ ఉంటే ఆట మరో స్థాయిలో ఉంటుంది. నేను అతన్ని మిస్ అవలేదు. భారత జట్టే అతడి సూచనలను, వ్యూహాలను మిస్ అయ్యింది. విరాట్.. ప్రపంచ స్థాయి ఆటగాడు. విరాట్ పేరే అతడి గురించి చెబుతుంది. అయితే ప్రత్యర్థి ఎవరన్నది మాకు ముఖ్యం కాదు. జట్టుగా.. ముందు మాపైనే దృష్టిసారిస్తాం."