IND vs SA 2nd Test: దక్షిణాఫ్రికా గడ్డపై సెంచూరియన్ వేదికగా జరిగిన తొలి టెస్టులో ఘనవిజయం సాధించింది టీమ్ఇండియా. ప్రస్తుతం రెండో టెస్టుపై ఫోకస్ చేసింది. న్యూఇయర్ సెలబ్రేషన్స్‌ను ఎంజాయ్ చేసిన ఆటగాళ్లు మళ్లీ ప్రాక్టీస్ బాట పట్టారు. అయితే ఈ టెస్టు కోసం యాజమాన్యం తుదిజట్టులో ఎవరికి చోటిస్తుందో అనేది ఉత్కంఠగా మారింది. తొలి టెస్టులో గాయపడిన బుమ్రాను ఆడిస్తుందా? లేదా? అన్నది అనుమానంగా మారింది. పుజారా, రహానే విఫలమవుతున్నా వారికి మరో అవకాశం ఇచ్చే వీలుంది. దీంతో శ్రేయస్ అయ్యర్ మరోసారి బెంచ్‌కే పరిమితమయ్యే అవకాశం ఉంది.
రెండో టెస్టులో భారత జట్టు (అంచనా)