Ind vs Pak womens world cup 2022: ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్ మార్చి 4న న్యూజిలాండ్‌లో మొదలైంది. మొదటి మ్యాచ్‌లో ఆతిథ్య జట్టు న్యూజిలాండ్, వెస్టిండీస్ తలపడగా.. కివీస్ మూడు పరుగుల తేడాతో ఓడిపోయింది. ఇక అందరి చూపు ఆదివారం జరగనున్న మ్యాచ్‌పై పడింది. చిరకాల ప్రత్యర్థులైన భారత్ పాకిస్థాన్ జట్లు తలపడటమే ఇందుకు కారణం.
ప్రపంచకప్‌లో ఇప్పటివరకు రెండు సార్లు భారత్-పాక్ తలపడగా.. రెండింటిలోనూ టీమ్ఇండియానే విజయం సాధించింది. కాగా, ఇరు జట్లు పది వన్డేల్లో పోటీపడగా అన్నింటా మన అమ్మాయిలే గెలిచారు. గత ప్రపంచకప్ టోర్నీలో రన్నరప్‌గా నిలిచిన భారత్ మహిళా జట్టు ఈ సారైనా కప్‌ను అందుకోవాలని ఆశిస్తోంది. ఈ నేపథ్యంలో ఇరు జట్లు మధ్య జరిగిన కొన్ని మ్యాచ్‌ల రికార్డులను తెలుసుకుందాం..
చివరి ఐదు మ్యాచ్‌ల వివరాలివీ..
జులై 2, 2017
ఈ మ్యాచ్‌లో 95 పరుగుల తేడాతో భారత్ గెలుపొందింది. మొదట టాస్ గెలిచిన మన జట్టు 50 ఓవర్లలో 169 పరుగులు మాత్రమే సాధించింది. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన పాకిస్థాన్‌ను 74 పరుగులకే ఆలౌట్ చేసింది టీమ్ఇండియా. ఏక్తా బిషిత్(5/18) అద్భుతమైన బౌలింగ్‌తో ఆకట్టుకుంది.
ఫిబ్రవరి 19, 2017
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్ జట్టు... ప్రత్యర్థిని 67 పరుగులకే కట్టడి చేసింది. బ్యాటింగ్‌కు దిగిన టీమ్ఇండియా తన చేతిలో ఏడు వికెట్లు ఉండగానే విజయం సాధించింది. ఏక్తా బిషిత్ పది ఓవర్లలో ఐదు వికెట్ల ప్రదర్శన చేసి అందరీ దృష్టిని ఆకర్షించింది.
ఫిబ్రవరి 7, 2013
2013 మహిళల ప్రపంచకప్‌లో భాగంగా జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన పాకిస్థాన్, ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. నిదా దార్ 68 పరుగులు తోడవ్వడం వల్ల 50 ఓవర్లలో 192/7 స్కోర్ చేసింది. అనంతరం మిథాలీ రాజ్ 141 బంతుల్లో అజేయంగా నిలిచి 103 పరుగులు చేయడం వల్ల భారత్ ఆరు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.