Ind vs Pak Weather Condition : 2023 ఆసియా కప్‌లో రెండోసారి జరగనున్న భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌కు ఇంకా కొద్ది సమయమే ఉంది. కేవలం వారం రోజుల గ్యాప్‌లోనే దాయాదుల పోరు రెండోసారి జరగడం అనేది క్రికెట్లో చాలా అరుదు. దీంతో క్రికెట్ ఫ్యాన్స్ ఈ మ్యాచ్‌ను చూసేందుకు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. అయితే మ్యాచ్ వేదికైన కొలంబోలోని వాతావరణం ఇప్పుడు క్రికెట్ ఫ్యాన్స్‌ను ఆందోళనకు గురిచేస్తోంది. శనివారం నాటి మ్యాచ్‌కు.. 90 శాతం వర్షం కురిసే అవకాశాలు ఉన్నాయంటూ శ్రీలంక వాతావరణ శాఖ ఇప్పటికే తెలిపింది. అయితే ప్రస్తుతం అక్కడ వాతావరణ పరిస్థితి ఎలా ఉందంటే..
శనివారం ఉదయం 8 గంటలైన సూర్యుడు దర్శనమివ్వలేదు. సరిగ్గా అదే సమయానికి కొలొంబోని పి. ప్రేమదాస స్టేడియం వద్ద మేఘాలు కమ్ముకున్నాయి. అయితే ఆ తర్వాత దాదాపు రెండు గంటల తర్వాత సూర్యుడు పలకరించాడు. దీంతో ప్రస్తుతానికి స్టేడియం ప్రాంతంలో వాతావరణం కాస్త పొడిగా మారిందని సమాచారం.
Ind Vs Pak Weather Upate : అయితే కొలంబో వెదర్ అప్డేట్లను స్టేడియం వద్ద ఉన్న అభిమానులు ఉదయం నుంచి ఇప్పటి వరకు.. సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. అక్కడ వాతావరణం క్లియర్‌గా ఉన్నట్లు.. వారు పోస్ట్ చేసిన ఫొటోల్లో కనిపిస్తోంది. ఇక లైవ్‌లో మ్యాచ్‌ను చూసేందుకు ఫ్యాన్స్ ఇప్పుడిప్పుడే స్టేడియానికి తరలివస్తున్నారు. అలాగే శుక్రవారం జరిగిన బంగ్లాదేశ్-శ్రీలంక మ్యాచ్‌కు వర్షం ఎలాంటి ఆటంకం కలిగించకపోవడం వల్ల ఫ్యాన్స్.. ఈ మ్యాచ్ కూడా సజావుగా సాగుతుందని ఆశిస్తున్నారు.