Ind vs Pak Super 4 : 2023 ఆసియ కప్ సూపర్ 4 లో భాగంగా ఆదివారం ఇండియా పాకిస్థాన్ మధ్య మ్యాచ్ ప్రారంభమైంది. కొలంబో వేదికగా జరుగతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన పాకిస్థాన్ జట్టు.. బౌలింగ్ ఎంచుకుంది. అయితే ఈ మ్యాచ్‌తో టీమ్ఇండియా జట్టులో మార్పులతో దిగింది. గాయల నుంచి కోలుకున్న కేఎల్ రాహుల్.. ఈ మ్యాచ్‌తో రీఎంట్రీ ఇచ్చాడు. దీంతో శ్రేయస్ అయ్యర్ బెంచ్‌కు పరిమితమయ్యాడు. మరోవైపు స్టార్ ప్లేయర్ జస్ప్రీత్ బుమ్రా కూడా ప్లేయింగ్ ఎలెవన్‌లోకి వచ్చాడు. మరోవైపు పాక్ సేన మాత్రం తమ తుది జట్టులో ఎటువంటి మార్పు లేకుండానే బరిలోకి దిగింది.
"టాస్ నెగ్గితే మేం తొలుత బ్యాటింగ్ చేయాలని భావించాం. పాక్‌తో మ్యాచ్ ఎప్పుడూ సవాల్‌తో కూడుకున్న విషయమే. గత మ్యాచ్‌లో మా బ్యాటర్లు ఆడిన తీరుతో ఆత్మవిశ్వాసం మరింత పెరిగింది. ఈ దశలో ప్రతి మ్యాచ్ మాకు కీలకమే. వర్షం ఆటంకం కలిగించడం అనేది కాస్త నిరుత్సాహానికి గురి చేస్తోంది. మా జట్టులో రెండు మార్పులు చేశాం. శ్రేయస్ అయ్యర్‌కు కాస్త వెన్ను నొప్పిగా అనిపించడం వల్ల అతనికి విశ్రాంతి ఇచ్చాం. ఇక అతడి స్థానంలో కేఎల్ రాహుల్ వచ్చాడు. పేసర్ బుమ్రా కూడా జట్టులోకి వచ్చేశాడు." అని రోహిత్ వెల్లడించాడు.
India Vs Pak Match Weather Report : కొలంబో వేదికగా జరగుతున్న ఈ మ్యాచ్‌లో వాన పడే సూచనలు కనిపిస్తున్నాయంటూ వాతావరణ శాఖ వెల్లడించింది. గ్రూప్ స్టేజ్‌లో ఇరు జట్ల మధ్య మ్యాచ్ కూడా వర్షం కారణంగా రద్దైన సంగతి తెలిసిందే. కనీసం ఈ మ్యాచ్‌నైనా పూర్తిగా చూస్తామా..? లేదా..? అనే సందిగ్ధత నెలకొంది. కానీ రిజర్వ్ డే ఉండటం వల్ల అభిమానులు కాస్త ఊరట చెందుతున్నారు.