టీ20 ప్రపంచకప్(t20 world cup 2021) ముగిశాక న్యూజిలాండ్(ind vs nz series 2021)తో పరిమిత ఓవర్ల సిరీస్‌లో తలపడనుంది టీమ్ఇండియా. మెగాటోర్నీలో వరుస పరాజయాలతో ఒత్తిడిలో ఉన్న భారత జట్టులోని కొంతమంది సీనియర్లు ఈ సిరీస్‌కు విశ్రాంతి తీసుకోనున్నారట. ఈ నేపథ్యంలో ఈ ద్వైపాక్షిక సిరీస్‌కు కేఎల్ రాహుల్(kl rahul news)ను కెప్టెన్‌గా నియమించనున్నారని ఓ బీసీసీఐ అధికారి తెలిపారు. అలాగే ఈ మ్యాచ్‌ల కోసం అభిమానుల్ని మైదానాలకు అనుమతిస్తామని వెల్లడించారు.
"సీనియర్లకు కాస్త విరామం అవసరం. రాహుల్ జట్టులో కీలక సభ్యుడు. టీ20 సిరీస్‌కు అతడు సారథ్యం వహించే అవకాశం ఉంది. అలాగే ఈ మ్యాచ్‌లు చూసేందుకు ప్రేక్షకులకు అనుమతిస్తాం. పూర్తి సామర్థ్యంతో కాకపోయినా.. కరోనా నిబంధనల్ని దృష్టిలో పెట్టుకుని ఈ విషయంపై బోర్డు మీటింగ్‌లో చర్చిస్తాం. ఇందుకోసం రాష్ట్ర క్రీడా బోర్డులతో మాట్లాడుతున్నాం."
-బీసీసీఐ అధికారి
టీ20 ప్రపంచకప్ తర్వాత తన టీ20 కెప్టెన్సీ(virat kohli t20 captaincy)కి రాజీనామా చేస్తానని తెలిపాడు విరాట్ కోహ్లీ(virat kohli news). దీంతో తదుపరి కెప్టెన్ ఎవరన్న విషయంపై ఇప్పటివరకు బీసీసీఐ స్పష్టత ఇవ్వలేదు. కొద్దిరోజుల్లోనే ఈ విషయంపై క్లారిటీ రానుంది. ప్రస్తుతం వైస్ కెప్టెన్‌గా ఉన్న రోహిత్.. టీ20 పగ్గాలు అందుకునే అవకాశం ఉంది. రాహుల్‌కు వైస్ కెప్టెన్సీ ఇవ్వనున్నారని తెలుస్తోంది. ఇంగ్లాండ్ పర్యటన నుంచి వరుసగా టోర్నీలు ఆడుతున్న కోహ్లీ, రోహిత్‌తో పాటు పలువురు సీనియర్లు న్యూజిలాండ్‌తో సిరీస్‌కు విశ్రాంతి తీసుకోనున్నారని సమాచారం. దీంతో రాహుల్‌కు పగ్గాలు అప్పజెప్పనున్నారు.
షెడ్యూల్ ఇదే!
టీ20 ప్రపంచకప్(t20 wrld cup 2021) ముగిశాక న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్(ind vs nz series 2021) జరగనుంది. మొదటి టీ20 నవంబర్ 17న జైపుర్ వేదికగా జరుగుతుంది. ఆ తర్వాత 19న రాంచీ, 21న కోల్‌కతా వేదికలుగా మిగతా రెండు టీ20లు నిర్వహిస్తారు. అనంతరం 25న టెస్టు సిరీస్ ప్రారంభమవుతుంది.