టీమ్ఇండియా రెండో వన్డేలో న్యూజిలాండ్ కష్టాల్లో పడింది. డ్రింక్స్ బ్రేక్ సమయానికి 14 ఏవర్లలో 28 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయింది. భారత బౌలర్లు సిరాజ్, షమీ తమ బంతులతో కివీస్ బ్యాటర్లకు చుక్కలు చూపిస్తున్నారు. పిచ్‌పై ఉన్న పచ్చికను బాగా ఉపయోగించుకున్న షమీ తొలి ఓవర్‌లోనే ఓపెనర్ ఫిన్ అలెన్‌కు క్లీన్‌బౌల్డ్ చేశాడు.
ఆ తర్వాత ఐదు, ఆరు ఓవర్లలో వరసుగా హెన్రీ నికోల్స్(2), డారిల్ మిచెల్(1) పెవిలియన్ చేరారు. సిరాజ్ బౌలింగ్‌లో హెన్రీ నికోల్స్ గిల్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఇక షమీ బౌలింగ్‌లో డారిల్ మిచెల్(1) క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు. అనంతరం 9, 10 ఓవర్లలో డెవన్ కాన్వాయ్(7), టామ్ లాథన్(1) నాలుగు, ఐదు వికెట్లుగా ఔటయ్యారు. ప్రస్తుతం కివీస్ 14.3 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 28 పరుగులు చేసింది. ప్రస్తుతం బ్రాస్ వెల్, గ్లెన్ ఫిలిప్స్ క్రీజులో ఉన్నారు.
రోహిత్‌కు వింత అనుభవం.. అయితే ఈ మ్యాచ్‌లో టాస్ సమయంలో టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మకు వింత అనుభవం ఎదురైంది. టాస్ గెలిచాకా రోహిత్.. తన నిర్ణయం ఏంటనేది చెప్పుకుండా నిలబడిపోయాడు. టాస్ నిర్ణయం కోసం వచ్చిన నిర్వాహకులు కూడా రోహిత్ ఏం చెప్తాడా? అని ఎదురు చూస్తూ ఉండిపోయారు. ఇలా కాసేపు ఆలోచించిన తర్వాత ముందుగా బౌలింగ్ చేస్తామని రోహిత్ చెప్పాడు.
'రోహిత్ ఏం చేస్తున్నావ్ అక్కడ?' అని రవిశాస్త్రి అడిగాడు. 'టీమ్ మీటింగ్‌లో కూడా ముందుగా బౌలింగ్ చేయాలా? బ్యాటింగ్ చేయాలా? అని చర్చించుకుంటూ ఉన్నాం. ఇప్పుడు కూడా అదే ఆలోచిస్తూ ఉండిపోయా' అని హిట్‌మ్యాన్ చెప్పాడు. దీంతో రోహిత్ చర్యతో టామ్ లాథమ్‌తో పాటు శ్రీనాథ్, రవిశాస్త్రిలు బాగా నవ్వుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఇదీ చూడండి:రొనాల్డో భారీ ఆఫర్.. మాస్టర్ చెఫ్ కావాలంట.. నెలకు రూ.4.5 లక్షల జీతం!