ఆఖరి వరకు ఉత్కంఠభరితంగా సాగిన పోరులో న్యూజిలాండ్‌పై భారత్ అతికష్టం మీద విజయం సాధించింది. దీంతో టీ20 ప్రపంచకప్‌లో ఆ జట్టు చేతిలో ఎదురైన పరాభవానికి ప్రతీకారం తీర్చుకుంది. దీంతో మూడు టీ20ల సిరీస్‌లో భారత్ 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.
టీమ్‌ఇండియా శుభారంభం.. ఉత్కంఠ పోరులో న్యూజిలాండ్‌పై విజయం - టీమ్‌ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ మ్యాచ్ లైవ్ అప్డేట్స్
న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో విజయం సాధించి శుభారంభం చేసింది టీమ్‌ఇండియా. ఐదు వికెట్ల తేడాతో గెలుపొందింది.
జైపూర్ వేదికగా జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై భారత్ ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన కివీస్ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. అనంతరం టీమ్‌ఇండియా నాలుగు వికెట్లను కోల్పోయి 19.4 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించింది. సూర్యకుమార్ యాదవ్ (62), కెప్టెన్ రోహిత్ శర్మ (48) రాణించారు. తొలి వికెట్‌కు కేఎల్ రాహుల్ (15)తో కలిసి రోహిత్ అర్ధశతక భాగస్వామ్మం నిర్మించాడు. రాహుల్ ఔటైన తర్వాత క్రీజ్‌లోకి వచ్చిన సూర్యకుమార్‌తో కలిసి రోహిత్ ఇన్నింగ్స్‌ను పరుగులు పెట్టించాడు. వీరిద్దరూ కలిసి మరో అర్ధశతకం (59) జోడించారు. రోహిత్ ఔటైనా.. సూర్యకుమార్ ధాటిగానే బ్యాటింగ్ చేశాడు. ఈ క్రమంలో టీ20 కెరీర్‌లో మూడో హాఫ్ సెంచరీ నమోదు చేసుకున్నాడు. అయితే దూకుడుగా ఆడుతున్న సూర్యకుమార్ కివీస్ బౌలర్ బౌల్ట్ బౌలింగ్‌లో క్లీన్‌బౌల్డయ్యాడు. రిషభ్ పంత్ 12*, శ్రేయస్ అయ్యర్ 5, వెంకటేశ్ అయ్యర్ 4 పరుగులు చేశారు. కివీస్ బౌలర్లలో ట్రెంట్ బౌల్ట్ 2, సౌథీ, డారిల్ మిచెల్, సాట్నర్ తలో వికెట్ తీశారు.
ఇదీ చూడండి: Ind vs Nz: గప్తిల్, చప్మన్ హాఫ్ సెంచరీ.. టీమ్‌ఇండియా లక్ష్యం 165