Ind vs Ire first T20 :మూడు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఐర్లాండ్‌తో జరిగిన తొలి పోరులో డక్‌వర్త్ లూయిస్ ప్రకారం భారత్ 2 పరుగుల తేడాతో గెలుపొందింది. వర్షం కారణంగా 6.5 ఓవర్ల వద్ద ఆటను నిలిపివేశారు. అప్పటికి భారత్ స్కోరు 47/2. డక్‌వర్త్ లూయిస్ ప్రకారం అప్పటికి భారత్ 2 పరుగుల ముందంజలో ఉంది. దీంతో భారత్‌ను విజేతగా ప్రకటించారు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్ 7 వికెట్ల నష్టానికి 139 పరుగులు చేసింది.
టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్.. ఆతిథ్య జట్టును 139 పరుగులకు కట్టడి చేసింది. ఎనిమిదో వికెట్లో వచ్చిన మెకర్థీ (51* 33 బంతుల్లో 4x4, 4x6) మెరుపు హాఫ్ సెంచరీకి తోడు, కాంఫర్ (39 పరుగులు)తో రాణించడం వల్ల ప్రత్యర్థి జట్టు ఆ మాత్రం స్కోరైనా చేయగలిగింది. అనంతరం 140 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన టీమ్ఇండియా 6 ఓవర్లు ముగిసేసరికి 45-0 పటిష్ఠ స్థితిలో ఉంది. కానీ ఏడో ఏవర్ బౌలింగ్ చేసేందుకు వచ్చిన క్రెయింగ్ యంగ్.. భారత్‌ను దెబ్బకొట్టాడు. ఇదే ఓవర్లో ఓపెనర్ యశస్వి జైశ్వాల్ (24)తో పాటు, వన్‌డౌన్‌లో వచ్చిన తిలక్ వర్మ (0) ను కూడా డకౌట్ చేశాడు. తర్వాత ఆటకు వర్షం అంతరాయం కలిగించింది.