నాటింగ్‌హామ్ టెస్టుకు వరుణుడు అడ్డంకిగా మారాడు. ఫలితం తేలేలా ఉన్న ఈ మ్యాచ్‌లో ఇప్పటికే పలుమార్లు వర్షం ఆటంకం కలిగించింది. ఇక ఐదో రోజు ఆట కూడా ఆలస్యంగా ప్రారంభం కానుంది.
Ind vs Eng Test: వర్షం కారణంగా ఐదో రోజు ఆట ఆలస్యం - ఇండియా vs ఇంగ్లాండ్ లైవ్ స్కోర్లు
వర్షం కారణంగా ఇంగ్లాండ్-ఇండియా తొలి టెస్టు ఐదో రోజు ఆట ఆలస్యంగా ప్రారంభమయ్యే అవకాశం ఉంది. రోజంతా వర్ష సూచన ఉన్న నేపథ్యంలో ఈ మ్యాచ్‌లో ఫలితం తేలే అవకాశాలు కనిపించడం లేదు. ప్రస్తుతం విజయానికి 157 పరుగుల దూరంలో ఉంది టీమ్ఇండియా.
ఇండియా vs ఇంగ్లాండ్
209 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ రెండో ఇన్నింగ్స్‌లో ఒక వికెట్ నష్టానికి 52 పరుగులు చేసింది. విజయానికి మరో 157 పరుగుల దూరంలో ఉంది. క్రీజులో ఓపెనర్ రోహిత్ శర్మ (12*),వన్‌డౌన్ బ్యాట్స్‌మన్ పుజారా (12*) ఉన్నారు. మరో ఓపెనర్ కేఎల్ రాహుల్‌ను (26) స్టువర్ట్ బ్రాడ్ క్యాచౌట్‌గా వెనక్కి పంపాడు.
అంతకుముందు రెండో ఇన్నింగ్స్‌లో 303 రన్స్ సాధించింది ఆతిథ్య ఇంగ్లాండ్. కెప్టెన్ రూట్ సెంచరీతో ఆకట్టుకున్నాడు.