తెలంగాణ

telangana

ETV Bharat / sports

టీ బ్రేక్​: విజయం కోసం భారత్.. డ్రా కోసం ఇంగ్లాండ్ - టీ బ్రేక్​ ఇన్నింగ్స్​

టీమ్​ఇండియాతో జరుగుతున్న రెండో టెస్టు ఐదో రోజు ఆటలో టీ బ్రేక్​ సమయానికి ఇంగ్లాండ్​ 205 పరుగులు వెనుకంజలో ఉంది. క్రీజులో కెప్టెన్​ జోరూట్​(33) ఉన్నాడు.

teamindia
టీమ్​ఇండియా

By

Published : Aug 16, 2021, 8:29 PM IST

Updated : Aug 16, 2021, 9:04 PM IST

టీమ్​ఇండియాతో జరుగుతున్న రెండో టెస్టు ఐదో రోజు ఆటలో టీ బ్రేక్​ సమయానికి ఇంగ్లాండ్​ 205 పరుగులు వెనుకంజలో ఉంది. ప్రస్తుతానికి రెండో ఇన్నింగ్స్​లో 4 వికెట్ల నష్టానికి 67 పరుగులు చేసింది. క్రీజులో కెప్టెన్​ జోరూట్​(33) ఉన్నాడు.

రెండో ఇన్నింగ్స్​ ప్రారంభించిన ఇంగ్లాండ్​కు శుభారంభం దక్కలేదు. టీమ్​ఇండియా బౌలర్లు బుమ్రా, షమీ, ఇషాంత్​ శర్మ అదరగొట్టారు. దీంతో రెండు ఓవర్లకే రెండు వికెట్లు కోల్పోయింది ఇంగ్లీష్ జట్టు. తొలి ఓవర్‌లో బుమ్రా.. బర్న్స్‌ను ఔట్‌ చేయగా రెండో ఓవర్‌లో షమీ.. సిబ్లీ(0)ని పెవిలియన్‌ పంపాడు. ఫలితంగా 2 ఓవర్లకు ఆ జట్టు స్కోర్‌ 3/2గా నమోదైంది. ఆ తర్వాత ఇషాంత్‌ వేసిన 15.3 ఓవర్‌లో హమీద్‌(9) 44 పరుగుల వద్ద మూడో వికెట్​గా వెనుదిరిగాడు. అనంతరం ఇషాంత్‌ బౌలింగ్​లోనే 21వ ఓవర్‌ చివరి బంతికి బెయిర్‌స్టో (2) ఎల్బీడబ్ల్యూగా పెవిలియన్ చేరాడు. దీంతో టీ విరామ సమయానికి ఇంగ్లాండ్‌ 22 ఓవర్లకు నాలుగు కీలక వికెట్లు కోల్పోయి 67 పరుగులు చేసింది.

అంతకుముందు టీమ్‌ఇండియా రెండో ఇన్నింగ్స్‌లో 298/8 స్కోర్‌ వద్ద ఇన్నింగ్స్‌ డిక్లేర్‌ చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్‌ 391 పరుగులకు ఆలౌటయ్యాక.. 27 పరుగుల లోటుతో రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభించిన భారత్‌ చివరికి ఆతిథ్య జట్టు ముందు 272 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది.

ఇదీ చూడండి: ఇంగ్లాండ్​ కవ్వింపులు.. కోహ్లీ ఫైర్!

Last Updated : Aug 16, 2021, 9:04 PM IST

ABOUT THE AUTHOR

...view details