తెలంగాణ

telangana

ETV Bharat / sports

IND vs ENG Lunch: బుమ్రా, షమీ షో.. భారత్ 286/8

లార్డ్స్​ టెస్టులో టీమ్ఇండియా పేసర్లు బుమ్రా, షమీ బ్యాటింగ్​తో అదరగొట్టారు. దీంతో ఐదో రోజు లంచ్ సమయానికి 8 వికెట్ల నష్టానికి 286 పరుగులు చేసింది భారత జట్టు. ఇంగ్లాండ్​పై ప్రస్తుతానికి 259 పరుగుల ఆధిక్యంలో ఉంది.

india vs england
ఇండియా vs ఇంగ్లాండ్

By

Published : Aug 16, 2021, 4:28 PM IST

Updated : Aug 16, 2021, 5:38 PM IST

లార్డ్స్​ టెస్టులో భారత టెయిలెండర్లు అద్భుతమే చేశారు. షమీ- బుమ్రా జోడీ తొమ్మిదో వికెట్​కు పరుగుల వరద పారించారు. ఇంగ్లాండ్ బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొంటూ భారత్​ను పటిష్ట స్థితికి చేర్చారు. దీంతో ఐదో రోజు లంచ్ సమయానికి కోహ్లీసేన రెండో ఇన్నింగ్స్​లో ఎనిమిది వికెట్ల నష్టానికి 286 పరుగులు చేసింది. ఇంగ్లాండ్​ ముందు 259 పరుగుల లక్ష్యంతో కొనసాగుతోంది. ఇక మ్యాచ్​లో ఫలితం వచ్చే అవకాశాలు కనిపించడం లేదు. చివరి రోజు మిగిలిన ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించడం రూట్​ సేనకు కష్టంతో కూడినదనే చెప్పాలి.

181/6తో ఐదో రోజు ఆట మొదలుపెట్టిన కోహ్లీసేనకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఫోర్ కొట్టి ఊపు మీద కనిపించిన పంత్​ను రాబిన్సన్​ బోల్తా కొట్టించాడు. అతడి బౌలింగ్​లో కీపర్​ క్యాచ్​గా వెనుదిరిగాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన షమీ.. ఇషాంత్​తో కలిసి కాస్త సమయం బ్యాట్​ ఝళిపించాడు. ఈ జంట చివర్లో స్కోరు బోర్డు వేగం పెంచేందుకు ప్రయత్నించారు. సరిగ్గా ఆ సమయంలోనే ఇషాంత్​ను రాబిన్సన్​ వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు.

బుమ్రా- షమీ భాగస్వామ్యం..

తొమ్మిదో వికెట్​గా క్రీజులోకి వచ్చిన బుమ్రా.. షమీతో కలిసి ఇన్నింగ్స్​ను చక్కబెట్టే ప్రయత్నం చేశాడు. ఈ జోడీ డిఫెన్స్​తో పాటు చూడచక్కని షాట్లతో అలరించింది. అనవసరపు షాట్లకు పోకుండా చెత్త బంతుల్ని బౌండరీకి తరలించారు. ప్రస్తుతానికి తొమ్మిదో వికెట్​కు 87 పరుగులు జోడీంచారు. ఈ క్రమంలోనే షమీ తన అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. ప్రస్తుతం షమీ 52*, బుమ్రా 30* పరుగులతో క్రీజులో ఉన్నారు.

Last Updated : Aug 16, 2021, 5:38 PM IST

ABOUT THE AUTHOR

...view details