తెలంగాణ

telangana

ETV Bharat / sports

Ind vs Aus World Cup 2023 : స్పిన్ మ్యాజిక్​.. ఆస్ట్రేలియా ఆలౌట్​.. టీమ్ ఇండియా లక్ష్యం ఎంతంటే? - వరల్డ్ కప్​ టీమ్​ ఇండియా లక్ష్యం ఎంతంటే

Ind vs Aus World Cup 2023 : 2023 వరల్డ్​ కప్​లో భాగంగా భారత్-ఆస్ట్రేలియా మధ్య మ్యాచ్ ప్రారంభమైన సంగతి తెలిసిందే. మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా... టీమ్​ ఇండియాను ముందు ఎంత లక్ష్యం ఉంచిందంటే?

Ind vs Aus World Cup 2023 : జడ్డూ మ్యాజిక్​.. ఆస్ట్రేలియా ఆలౌట్​..  టీమ్ ఇండియా లక్ష్యం ఎంతంటే?
Ind vs Aus World Cup 2023 : జడ్డూ మ్యాజిక్​.. ఆస్ట్రేలియా ఆలౌట్​.. టీమ్ ఇండియా లక్ష్యం ఎంతంటే?

By ETV Bharat Telugu Team

Published : Oct 8, 2023, 6:07 PM IST

Updated : Oct 8, 2023, 6:40 PM IST

Ind vs Aus World Cup 2023 : వన్డే ప్రపంచ కప్‌లో భాగంగా చెన్నై వేదికగా జరుగుతున్న మ్యాచ్​లో ఆస్ట్రేలియా (IND vs AUS) ఇన్నింగ్స్​ ముగిసింది. భారత స్పిన్నర్లు మంచిగా రాణించారు. దీంతో ఆసీస్​ 49.3 ఓవర్లలో ఆలౌటై 199 పరుగులు చేసింది. ఫలితంగా టీమ్ ఇండియా ముందు 200 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. స్టీవ్ స్మిత్​(71 బంతుల్లో 46; 5x4), వార్నర్​(52 బంతుల్లో 41; 6x4) బాగానే రాణించారు. మార్నస్​ లబుషేన్(27), గ్లెన్ మ్యాక్స్​వెల్​(15), ప్యాట్ కమిన్స్​(15) నామమాత్రపు స్కోరు చేశారు. ఇక చివర్లో వచ్చిన మిచెల్​ స్టార్క్​(28) స్కోరు బోర్డును కాస్త ముందుకు తీసుకెళ్లాడు. అడం జంపా(6), జోష్ హెజిల్​వుడ్​(1*) స్కోర్​ చేశారు. స్పిన్నర్లకే అనుకూలమైన చెపాక్‌ పిచ్‌పై భారత బౌలర్లు అదరగొట్టారు. జడేజా (3/28) మ్యాజిక్ చేశాడు. కుల్‌దీప్‌ (2/42), అశ్విన్‌ (1/34) చక్రం తిప్పారు. పేసర్‌ బుమ్రా (2/35) కూడా రాణించగా.. సిరాజ్‌, హార్దిక్‌ ఒక్కో వికెట్‌ దక్కించుకున్నారు.

మ్యాచ్ సాగిందిలా.. మొదటి ఓవర్‌లో 1 పరుగు మాత్రమే ఇచ్చిన బుమ్రా.. ఇన్నింగ్స్ మూడో ఓవర్‌లో వికెట్ తీసి... వన్డే ప్రపంచ కప్‌ టోర్నీని ఘనంగా ఆరంభించాడు. 6 బంతులు ఆడిన మిచెల్ మార్ష్.. బుమ్రా బౌలింగ్‌లో కోహ్లీ అందుకున్న స్టన్నింగ్ క్యాచ్‌కు ఔట్ అయ్యాడు. వరల్డ్ కప్‌‌ మ్యాచ్‌లో ఆసీస్ ఓపెనర్‌ను డకౌట్ చేసిన మొదటి భారత బౌలర్‌గా నిలిచాడు బుమ్రా.

ఆ తర్వాత వార్నర్, స్టీవ్ స్మిత్ కలిసి రెండో వికెట్‌కు 69 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. 52 బంతుల్లో 6 ఫోర్లతో 41 పరుగులు చేసిన వార్నర్, కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌లో అతడికే క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. 71 బంతుల్లో 5 ఫోర్లతో 46 పరుగులు చేసిన స్టీవ్ స్మిత్‌ను రవీంద్ర జడేజా క్లీన్ బౌల్డ్ చేశాడు. ఇంటర్నేషనల్​ క్రికెట్‌లో రవీంద్ర జడేజా బౌలింగ్‌లో స్టీవ్ స్మిత్ ఔట్​ కావడం ఇది 11వ సారి.

ఇక 41 బంతుల్లో ఓ ఫోర్‌తో 27 పరుగులు చేసిన మార్నస్ లబుషేన్ కూడా రవీంద్ర జడేజా బౌలింగ్‌లోనే ఔట్ అయ్యాడు. అలెక్స్ క్యారీ ఎల్బీడబ్ల్యూగా పెవిలియన్ చేరాడు. గ్లెన్ మ్యాక్స్‌వెల్‌ను కుల్దీప్ యాదవ్ క్లీన్ బౌల్డ్ చేశాడు. ఆ తర్వాతి ఓవర్‌లో కామెరూన్ గ్రీన్‌ను రవిచంద్రన్ అశ్విన్ ఔట్​ చేశాడు. 20 బంతుల్లో 8 పరుగులు చేసిన కామెరూన్ గ్రీన్, అశ్విన్ బౌలింగ్‌లో హార్ధిక్ పాండ్యాకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు.

అలా 140 పరుగులకే 7 వికెట్లు కోల్పోయింది ఆస్ట్రేలియా. అనంతరం ఆసీస్ కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్​, అడం జంపా ఔట్ అయ్యారు. ఇక చివర్లో వచ్చిన మిచెల్ స్టార్క్ 35 బంతుల్లో 2 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 28 పరుగులు చేసి ఆస్ట్రేలియా స్కోరును 200 మార్కుకు చేర్చాడు. ఫైనల్​గా ఆస్ట్రేలియా బ్యాటర్లు ఆఖరి 3 వికెట్లకు 59 పరుగులు జోడించడం విశేషం.

World Cup 2023 Ind vs Aus : చెపాక్​లో భారత్​ తొలిపోరు.. ఆస్ట్రేలియాపై జోరు ప్రదర్శించేనా?

World Cup Most Runs Indian Batsman : విశ్వకప్​లో భారత పరుగుల వీరులు.. టాప్​లో సచిన్.. రోహిత్-కోహ్లీ ప్లేస్ ఎంతంటే?

Last Updated : Oct 8, 2023, 6:40 PM IST

ABOUT THE AUTHOR

...view details