తెలంగాణ

telangana

ETV Bharat / sports

Ind vs Aus 2nd ODI 2023 : అయ్యర్-గిల్ సెంచరీల మోత.. భారీ స్కోర్ దిశగా భారత్.. ఆసీస్ బౌలర్లను ఆట ఆడేస్తున్నారుగా - shubman gill centuries in odi

Ind vs Aus 2nd ODI 2023 : ఇందౌర్​ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో వన్డేలో టీమ్ఇండియా సంచలనం గిల్​, కమ్​బ్యాక్ ప్లేయర్ అయ్యర్ అదరగొట్టారు. వీరిద్దరూ ప్రత్యర్థి బౌలర్లను దీటుగా ఎదుర్కొంటూ.. శతకాలు నమోదు చేశారు.

Ind vs Aus 2nd ODI 2023
Ind vs Aus 2nd ODI 2023

By ETV Bharat Telugu Team

Published : Sep 24, 2023, 4:38 PM IST

Updated : Sep 24, 2023, 5:55 PM IST

Ind vs Aus 2nd ODI 2023 : భారత్-ఆస్ట్రేలియా మధ్య జరగుతున్నరెండో వన్డేలో టీమ్ఇండియా బ్యాటర్లు అదరగొడుతున్నారు. యంగ్​ స్టార్ శుభ్​మన్ గిల్​ (104 పరుగులు : 97 బంతులు, 6x4, 4x6), కమ్​బ్యాక్ ప్లేయర్ శ్రేయస్ అయ్యర్ (105 పరుగులు : 90 బంతులు, 11x4, 3x6) శతకాలతో చెలరేగిపోయారు. ఈ క్రమంలో గిల్​ తన వన్డే కెరీర్​లో ఆరో సెంచరీ నమోదు చేయగా.. అయ్యర్​కు ఇది మూడవది.

రుతురాజ్ గైక్వాడ్ (8) ఔటైన తర్వాత క్రీజులోకి వచ్చిన అయ్యర్​తో జతకట్టాడు గిల్​. వీరిద్దరూ ఆసీస్ బౌలర్లలను చీల్చి చెండాడారు. స్ట్రైక్​​ రొటేట్ చేస్తూ.. వీలు చిక్కినప్పుడల్లా బౌండరీలు బాదుతూ.. స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు. మొదటి నుంచి రన్​రేట్ 7 కు తగ్గకుండా చూసుకున్నారు. ఈ క్రమంలోనే ఇద్దరూ హాఫ్​ సెంచరీలు పూర్తి చేసుకొని స్వేచ్ఛగా క్రీజులో పరుగులు చేశారు. ముఖ్యంగా అయ్యర్.. ఈ ఇన్నింగ్స్​లో ఫోర్ల వర్షం కురిపించాడు. ఈ క్రమంలోనే వీరిద్దరూ సెంచరీలు పూర్తి చేశారు. వీరిద్దరూ రెండో వికెట్​కు 200 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశారు. దీంతో భారత్ తరఫున రెండో వికెట్​కు అత్యధిక భాగస్వామ్యం నమోదు చేసిన ఆటగాళ్లలో ఈ జోడీ చేరింది.

ఇక సెంచరీ చేసిన కొద్దిసేపటికే అయ్యర్.. సీన్ అబాట్ బౌలింగ్​లో క్యాచౌట్​గా వెనుదిరిగాడు. తర్వాత 34.5 ఓవర్ల వద్ద గిల్​ను.. గ్రీన్​ పెవిలియన్ చేర్చాడు. అప్పుడు క్రీజులోకి వచ్చిన కెప్టెన్ కేఎల్ రాహుల్ కూడా సిక్స్​లతో రెచ్చిపోయాడు. స్ట్రైక్ రేట్ 100 కు తగ్గకుండా ఆడుతూ 35 బంతుల్లోనే.. వరుసగా ఈ సిరీస్​లో రెండో అర్ధ సెంచరీ బాదాడు. మరో ఎండ్​లో ఉన్న ఇషాన్ కిషన్ (31 పరుగులు : 18 బంతుల్లో 2x2, 2x6) వేగంగా ఆడే ప్రయత్నంలో ఆడమ్​ జంపాకు వికెట్ సమర్పించుకున్నాడు.

ఆసీస్​-భారత్​ మ్యాచ్​ల్లో (వన్డే) ఏ వికెట్​కైనా అత్యధిక పరుగుల టాప్ 5 భాగస్వామ్యాలు..

  • వీవీఎస్ లక్ష్మణ్-యువరాజ్ సింగ్.. 213 పరుగులు
  • విరాట్ కోహ్లీ-శిఖర్ ధావన్ .. 212 పరుగులు
  • విరాట్ కోహ్లీ-రోహిత్ శర్మ .. 207 పరుగులు
  • శుభ్​మన్ గిల్-శ్రేయస్ అయ్యర్ .. 200 పరుగులు
  • సచిన్ తెందూల్కర్-వీవీఎస్ లక్ష్మణ్.. 199

Rahul Dravid Son Cricket : అండర్‌-19 జట్టుకు ఎంపికైన ద్రవిడ్‌ తనయుడు.. ఏ టోర్నీలో ఆడనున్నాడంటే ?

Varanasi Cricket Stadium : మోదీకి సచిన్, జై షా గిఫ్ట్స్​.. ఏమిచ్చారో తెలుసా?

Last Updated : Sep 24, 2023, 5:55 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details