తెలంగాణ

telangana

ETV Bharat / sports

'మెగాటోర్నీలో ఈ డెబ్యూ ప్లేయర్ల ఆటకు ఫిదా!' - రచిన్ రవీంద్ర వరల్డ్​కప్ 2023 గణాంకాలు

Impressing Debutants World Cup 2023 : 2023 ప్రపంచకప్​లో వివిధ జట్లనుంచి అనేక మంది ప్లేయర్లు తొలిసారి మెగాటోర్నీలో ఆడారు. ఈ క్రమంలో టీమ్ఇండియా మాజీ ప్లేయర్ ఇర్ఫాన్ పఠాన్.. తనను ఇంప్రెస్ చేసిన డెబ్యూ ప్లేయర్లెవరో సోషల్ మీడియాలో చెప్పాడు.

Impressing Debutants World Cup 2023
Impressing Debutants World Cup 2023pressing Debutants World Cup 2023

By ETV Bharat Telugu Team

Published : Nov 13, 2023, 10:48 PM IST

Impressing Debutants World Cup 2023 :2023 వరల్డ్​కప్​ లీగ్​ స్టేజ్​లో అనేక అత్యుత్తమ ప్రదర్శనలు నమోదయ్యాయి. పాయింట్ల పట్టకలో అగ్రస్థానంలో ఉన్న టీమ్ఇండియా నుంచి అట్టడుగున ఉన్న నెదర్లాండ్స్ వరకు.. దాదాపు ప్రతీ జట్టులో ఒకరిద్దరు అరంగేట్ర ఆటగాళ్లు తమ ప్రదర్శనలతో ఆకట్టుకున్నారు. ఈ క్రమంలో టీమ్ఇండియా మాజీ ఆల్​రౌండర్ ఇర్ఫాన్ పఠాన్.. మెగాటోర్నీలో తనను ఇంప్రెస్ చేసిన ఐదుగురు అరంగేట్ర ఆటగాళ్ల పేర్లు ట్విట్టర్​ ద్వారా వెల్లడించాడు.

రచిన్ రవీంద్ర, శ్రేయస్ అయ్యర్, మార్కొ జాన్సన్, అజ్మతుల్లా ఓమర్జాయ్, దిల్షాన్ మధుషంక పేర్లను ఇర్ఫాన్ సోషల్ మీడియాలో ప్రకటించాడు. " ప్రపంచకప్​లో ఈ ఐదుగురు అరంగేట్ర ఆటగాళ్లు నిజంగా నన్ను ఆకట్టుకున్నారు. వారి నైపుణ్యాలు కెరీర్​లో వాళ్లను ఉన్నత స్థాయికి తీసుకెళ్తాయి" అని ఇర్ఫాన్ అన్నాడు. ఇక ప్రస్తుత వరల్డ్​కప్​లో ఇర్ఫాన్ పఠాన్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే.

  • రచిన్ రవీంద్ర.. మెగాటోర్నీలో అసాధారణ ప్రదర్శనలతో దూసుకుపోతున్నాడు న్యూజిలాండ్ యంగ్ బ్యాటర్ రచిన్ రవీంద్ర. అతడు 9 మ్యాచ్​ల్లో కలిపి 70.62 సగటుతో 565 పరుగులు చేశాడు. ఇందులో 3 సెంచరీలు ఉన్నాయి.
  • శ్రేయస్ అయ్యర్.. టీమ్ఇండియా యంగ్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్.. కెరీర్​లో తొలి వరల్డ్​కప్ ఆడుతున్నాడు. ఈ క్రమంలో అతడికి ఛాన్స్​ వచ్చినప్పుడల్లా చెలరేగిపోతున్నాడు. ఈ టోర్నలో అయ్యర్.. 9 మ్యాచ్​ల్లో 421 పరుగులు బాదాడు. ఇందులో ఒక సెంచరీ ఉంది.
  • మార్కొ జాన్సన్.. సౌతాఫ్రికా ఆల్​రౌండర్ మార్కొ జాన్సన్.. తమ జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. అతడు ఇంగ్లాండ్​పై.. 176 స్ట్రైక్​ రేట్​తో 74 పరుగులు బాది బీభత్సం సృష్టించాడు.
  • అజ్మతుల్లా ఓమర్జాయ్.. అఫ్గానిస్థాన్ ఆల్​రౌండర్ అజ్మతుల్లా ఓమర్జాయ్.. బ్యాట్​తో అద్భుతంగా రాణించాడు. అతడు టోర్నీలో 353 పరుగులు చేసి.. బౌలింగ్​లో 7 వికెట్లు పడగొట్టి అందరి దృష్టిని ఆకర్షించాడు.
  • దిల్షాన్ మధుషంక.. శ్రీలంక బౌలర్ దిల్షాన్ మధుషంక.. టోర్నీలో అత్యంత విజయవంతమైన బౌలర్లలో ఒకడు. అతడు 9 మ్యాచ్​ల్లో కలిపి 21 వికెట్లు పడగొట్టాడు.

ABOUT THE AUTHOR

...view details