Shubman Gill: అవకాశముంటే ఐపీఎల్‌లో ఎప్పటికీ కోల్‌కతా నైట్‌రైడర్స్‌కే ఆడాలని ఉందని ఆ జట్టు మాజీ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ అన్నాడు. నైట్‌రైడర్స్‌కు ఎన్నో విజయాలందించినప్పటికీ.. గిల్‌ను ఆ జట్టు అట్టిపెట్టుకోలేదు. అయితే వేలంలో గిల్‌ను కోల్‌కతానే దక్కించుకుంటుందన్న అంచనాలున్నాయి. ఈ నేపథ్యంలో అతను స్పందిస్తూ.. "కేకేఆర్ ఫ్రాంఛైజీతో నా అనుబంధం చాలా ప్రత్యేకమైంది. ఒకసారి ఇలాంటి బంధం ఏర్పడితే ఎప్పటికీ ఆ జట్టుతోనే ఉండిపోవాలనిపిస్తుంది. నాకైతే వీలుంటే ఎప్పుడూ బంగారం, ఊదా రంగు కలగలిసిన దుస్తుల్లోనే ఐపీఎల్ ఆడాలని ఉంది" అన్నాడు.
Shubhman Gill: 'ఎప్పుడూ కేకేఆర్కే ఆడాలని ఉంది' - శుభ్‌మన్ గిల్ కేకేఆర్
Shubman Gill: ఐపీఎల్‌లో ఎప్పటికీ కోల్‌కతా నైట్‌రైడర్స్‌కే ఆడాలని ఉందన్నాడు ఆ జట్టు మాజీ ఓపెనర్ శుభ్‌మన్ గిల్. కేకేఆర్ ఫ్రాంచైజీతో తన అనుబంధం చాలా ప్రత్యేకమైందని పేర్కొన్నాడు.
కేకేఆర్ తనను అట్టిపెట్టుకోకపోవడంపై స్పందిస్తూ.. "జట్టులో చాలామంది ప్రతిభావంతులున్నారు. అట్టిపెట్టుకోవాలనుకునే ఆటగాళ్ల జాబితా పెద్దదే. కానీ అందరినీ నిలుపుకునే అవకాశం లేదు కదా" అని చెప్పాడు. మళ్లీ కోల్‌కతాకు ఆడే అవకాశం వస్తే ఎంతో సంతోషిస్తానని.. జట్టు ఎప్పుడూ ఒకే రకంగా ఉండదని, మార్పులకు తగ్గట్లు సర్దుకుపోవాల్సి ఉంటుందని శుభ్‌మన్ అభిప్రాయపడ్డాడు. 2018 వేలంలో గిల్‌ను కోల్‌కతా రూ.1.8 కోట్లకు కొనుక్కుంది. ఆ జట్టు తరఫున అతను 58 మ్యాచ్‌ల్లో 1417 పరుగులు చేశాడు. గత మూడు సీజన్లలో కోల్‌కతా తరఫున అత్యధిక పరుగులు చేసింది శుభ్‌మనే.
ఇదీ చూడండి :అది మా జట్టుకు కలిసొచ్చే అంశం: పుజారా