IND Vs SL World Cup 2023 :వరల్డ్‌కప్ సెమీస్‌లోకి అడుగుపెట్టింది భారత్. వాంఖడే స్టేడియంలో శ్రీలంకతో జరుగుతున్న మ్యాచ్‌లో భారత్ అదరగొట్టింది. 358 పరుగుల లక్ష్యంతో దిగిన లంకను 55 పరుగులకే ఆలౌట్ చేసింది. ఇప్పటికే ఆరు విజయాలు సాధించిన టీమ్‌ఇండియా.. తాజాగా శ్రీలంకను 302 పరుగుల తేడాతో చిత్తుచిత్తుగా ఓడించి అధికారికంగా సెమీస్‌కు దూసుకెళ్లింది. వన్డేల్లో పరుగుల పరంగా భారత్‌కిది నాలుగో అతిపెద్ద విజయం. ఈ ఓటమితో శ్రీలంక అధికారికంగా సెమీస్ రేసు నుంచి నిష్క్రమించింది. 358 పరుగుల భారీ లక్ష్యఛేదనలో భారత పేసర్ల ధాటికి శ్రీలంక 19.4 ఓవర్లలో 55 పరుగులకే కుప్పకూలింది. కాసున్ రజిత (14) టాప్ స్కోరర్. మాథ్యూస్ (12), తీక్షణ (12) పరుగులు చేశారు. మిగతా బ్యాటర్లంతా సింగిల్ డిజిట్ స్కోరుకే పరిమతమయ్యారు. షమి (5/18), సిరాజ్ (3/16) లంకను గట్టిదెబ్బకొట్టారు. బుమ్రా, జడేజా ఒక్కో వికెట్ పడగొట్టారు.
అదరగొట్టిన షమీ, చిత్తుగా ఓడిన శ్రీలంక- రికార్డ్ విజయంతో సెమీస్‌లోకి భారత్ - ఇండియా వర్సెస్ శ్రీలంక మ్యాచ్ అప్డేట్స్
IND Vs SL World Cup 2023 : ప్రపంచకప్‌లో టీమ్‌ఇండియా మరోసారి అదరగొట్టింది. ముంబయిలోని వాంఖడే వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో శ్రీలంకను చిత్తుగా ఓడించి సెమీస్‌లోకి అడుగుపెట్టింది.
Published : Nov 2, 2023, 8:35 PM IST
|Updated : Nov 2, 2023, 8:57 PM IST
అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 357 పరుగులు చేసింది. ఓపెనర్ రోహిత్ శర్మ 4 పరుగులకే ఔట్ కాగా.. మరో ఓపెనర్ శుభ్‌మన్ గిల్ (92; 92 బంతుల్లో 11 ఫోర్లు, 2 సిక్స్‌లు), విరాట్ కోహ్లీ (88; 94 బంతుల్లో 11 ఫోర్లు) చక్కని ఇన్నింగ్స్ ఆడారు. వీరిద్దరూ రెండో వికెట్‌కు 189 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని జోడించారు. ఇద్దరూ సెంచరీల దిశగా సాగుతున్న సమయంలో దిల్షాన్ మధుశంక వీరి జోడిని విడదీయడమే కాకుండా, విరాట్ కోహ్లీని కూడా ఔట్ చేశాడు. అనంతరం బ్యాటింగ్‌కు వచ్చిన శ్రేయస్ అయ్యర్ (82; 56 బంతుల్లో 3 ఫోర్లు, 6 సిక్స్‌లు) భారీ ఇన్నింగ్స్ ఆడి జట్టు స్కోరు 300 దాటడంలో కీలక పాత్ర పోషించాడు. కేఎల్ రాహుల్ (21; 19 బంతుల్లో 2 ఫోర్లు), సూర్యకుమార్ యాదవ్ (12, 9 బంతుల్లో 2 ఫోర్లు) షమీ 2(4) ఎక్కువ సమయం క్రీజులో నిలవలేకపోయారు. చివరి బంతికి రవీంద్ర జడేజా 34(23) రనౌట్‌గా వెనుదిరగగా, బూమ్రా 1(1) నాటౌట్‌గా నిలిచాడు. శ్రీలంక బౌలర్లలో మధుశంక 5, దుష్మంత చమీర ఒక వికెట్ పడగొట్టారు.