తెలంగాణ

telangana

ETV Bharat / sports

Cricket: ఏడు ఐసీసీ టోర్నీలు.. ప్రతిసారి కొత్త విజేతనే

డబ్ల్యూటీసీ తొలి ఛాంపియన్​గా న్యూజిలాండ్ అవతరించింది. అయితే గత ఎనిమిదేళ్లలో జరిగిన ఏడు ఐసీసీ టోర్నీల్లో ఏడు జట్లు విజేతగా నిలవడం విశేషం. ఇంతకీ ఆ టోర్నీలు ఏంటి? అందులో గెలిచింది ఎవరు?

EVERY TIME NEW TEAM TO BE WINNER
క్రికెట్ న్యూస్

By

Published : Jun 24, 2021, 11:43 AM IST

ఐసీసీ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన ప్రపంచ టెస్టు ఛాంపియన్​షిప్ పూర్తయింది. భారత్​ను ఓడించిన న్యూజిలాండ్ విజేతగా నిలిచింది. అయితే గత ఏడేళ్లలో జరిగిన ఐసీసీ టోర్నీల్లో ప్రతిసారి కొత్త జట్టు విజేతగా నిలిచింది. దాదాపు ఏడు టోర్నీల్లో ఏడు జట్లు ట్రోఫీని ముద్దాడాయి. ఇంతకీ ఆ జట్లేంటి? ఆ కప్​లు ఏంటి?

2013 ఛాంపియన్స్ ట్రోఫీ- టీమ్​ఇండియా

ఇంగ్లాండ్​లో జరిగిన ఈ టోర్నీలో ధోనీ కెప్టెన్సీలో భారత్ విజేతగా నిలిచింది. ఇంగ్లీష్ జట్టుతో పోటీపడిన ఈ మ్యాచ్​లోనూ వర్షం ఆటంకం కలిగించింది. కానీ టీమ్​ఇండియా సమష్టి ప్రదర్శన చేసి కప్పు అందుకుంది.

2013 ఛాంపియన్స్ ట్రోఫీతో భారత్

2014 టీ20 ప్రపంచకప్-శ్రీలంక

ఈ టోర్నీ ఫైనల్​లో భారత్​తో తలపడిన శ్రీలంక విజేతగా నిలిచింది. ధోనీసేన నిర్దేశించిన 131 పరుగుల లక్ష్యాన్ని రెండు ఓవర్లు మిగిలుండగానే ఛేదించింది.

2014 టీ20 ప్రపంచకప్​తో శ్రీలంక

2015 వన్డే ప్రపంచకప్-ఆస్ట్రేలియా

స్వదేశంలో జరిగిన ఈ టోర్నీలో ఆస్ట్రేలియా పూర్తి ఆధిపత్యం ప్రదర్శించి సగర్వంగా కప్​ను ముద్దాడింది. న్యూజిలాండ్​తో జరిగిన ఫైనల్​లో 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది.

2015 వన్డే ప్రపంచకప్​తో ఆస్ట్రేలియా

2016 టీ20 ప్రపంచకప్- వెస్టిండీస్

భారత్​లో జరిగిన ఈ టోర్నీ తుదిపోరులో ఇంగ్లాండ్-వెస్టిండీస్​ తలపడ్డాయి. ఛేదనలో చివరి ఓవర్​లో నాలుగు సిక్సులు కొట్టిన కరీబియన్ ఆల్​రౌండర్ కార్లోస్ బ్రాత్​వైట్​.. తమ జట్టు విజేతగా నిలవడంలో కీలకపాత్ర పోషించాడు.

2016 టీ20 ప్రపంచకప్​తో వెస్టిండీస్

2017 ఛాంపియన్స్ ట్రోఫీ-పాకిస్థాన్

ఈ టోర్నీలో చిరకాల ప్రత్యర్థులు భారత్​-పాకిస్థాన్ కప్ కోసం​ తలపడ్డాయి. అయితే అన్ని మ్యాచ్​ల్లో నిలకడగా ఆడిన కోహ్లీసేన.. ఫైనల్​లో మాత్రం చేతులెత్తేసింది. దీంతో పాక్, 180 పరుగుల భారీ తేడాతో గెలిచి, విజేతగా నిలిచింది.

2017 ఛాంపియన్స్ ట్రోఫీతో పాకిస్థాన్

2019 వన్డే ప్రపంచకప్-ఇంగ్లాండ్

స్వదేశంలో జరిగిన ఈ టోర్నీలో ఫైనల్​లో ఇంగ్లాండ్, న్యూజిలాండ్​తో తలపడింది. సూపర్​ ఓవర్​ కూడా టై అయిన ఈ మ్యాచ్​లో బౌండరీల సంఖ్య ఆధారంగా ఇంగ్లీష్ జట్టును విజేతగా నిలిచింది.

2019 వన్డే ప్రపంచకప్​తో ఇంగ్లాండ్

2021 వరల్డ్ టెస్టు ఛాంపియన్​షిప్- న్యూజిలాండ్

ఐసీసీ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తొలిసారి నిర్వహించిన ఈ టెస్టు టోర్నీలో న్యూజిలాండ్ విజేతగా నిలిచింది. టీమ్​ఇండియాను ఓడించి, కప్​ను సొంతం చేసుకుంది.

టెస్టు ఛాంపియన్ ట్రోఫీతో న్యూజిలాండ్

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details