'బ్యాట్స్మెన్' పదాన్ని మార్చనున్నట్లు ప్రకటించింది ఐసీసీ(ICC News). దాని స్థానంలో లింగ బేధం చూపని 'బ్యాటర్'(batsman replaced by batter) పదాన్ని వినియోగిస్తామని తెలిపింది. క్రికెట్లో లింగ వివక్షత ఉండకూడదనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. టీ20 ప్రపంచకప్(T20 World Cup) ప్రారంభం నుంచి ఈ నిబంధన అమల్లోకి వస్తుందని ప్రకటించింది.
"నాలుగేళ్లుగా బ్యాట్స్మెన్ పదాన్ని వినియోగించడం లేదు. కామెంటరీ, ఆర్గనైజేషన్ ఛానళ్లలోనూ బ్యాటర్ అనే అంటున్నాం. ఎమ్సీసీ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం. క్రికెట్ నిబంధనల చట్టంలో దాన్ని అమలుచేసేలా చేస్తాం. బౌలర్, ఫీల్డర్ మాదిరిగానే ఈ బ్యాటర్ అనే పదం కూడా అందరికీ ఆపాదించేలా ఉంటుంది."
-ఐసీసీ ప్రకటన