తెలంగాణ

telangana

ETV Bharat / sports

టీ20 ప్రపంచకప్: భారత్​- పాక్​ 'మ్యాచ్'​ ఫిక్స్​- ఫ్యాన్స్​ ఖుష్​

టీ20 ప్రపంచకప్ డ్రా విడుదలైంది. గ్రూప్​ 2లో భారత్​తో పాటు పాకిస్థాన్ కూడా ఉంది. 8 జట్లు నేరుగా పొట్టి ప్రపంచకప్​కు అర్హత సాధించగా.. మరో నాలుగు స్థానాల కోసం క్వాలిఫయర్స్​లో 8 జట్లు పోటీ పడనున్నాయి. ఈ టోర్నీ అక్టోబర్ 17న ప్రారంభమవుతుంది.

T20
ఐసీసీ టీ20 ప్రపంచకప్

By

Published : Jul 16, 2021, 3:56 PM IST

Updated : Jul 16, 2021, 6:16 PM IST

అక్టోబర్​లో ప్రారంభమయ్యే టీ20 ప్రపంచకప్​ కోసం ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు అభిమానులు. ఈ నేపథ్యంలో వారికి మరింత ఊరటనిస్తూ మెగాటోర్నీ డ్రాను విడుదల చేసింది ఐసీసీ. ఫ్యాన్స్​కు మరో గుడ్ న్యూస్ ఏంటంటే.. దాయాది దేశాలు భారత్-పాకిస్థాన్ ఒకే గ్రూప్​లో ఉండటం. మార్చి 2021నాటి ర్యాంకింగ్స్ ఆధారంగా ఈ డ్రాను ప్రకటించారు. దీనిని సూపర్ 12 మ్యాచ్​లుగా నిర్వహించనున్నారు. ఈ టోర్నీ అక్టోబర్ 17 నుంచి నవంబర్ 14 వరకు జరగనుంది.

గ్రూప్ 1- వెస్టిండీస్, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, క్వాలిఫయర్ గ్రూప్-ఏ విజేత, గ్రూప్-బీ రన్నరప్

గ్రూప్ 2- భారత్, పాకిస్థాన్, న్యూజిలాండ్, అఫ్గానిస్థాన్, క్వాలిఫయర్ గ్రూప్-ఏ రన్నరప్, గ్రూప్​-బీ బీ విజేత

టీ20 ప్రపంచకప్ డ్రా

క్వాలిఫయర్స్

టీ20 ప్రపంచకప్​లో క్వాలిఫై కోసం ఏకంగా ఎనిమిది జట్లు పోటీపడుతున్నాయి. వీటి మధ్య రౌండ్ 1 పోటీలను నిర్వహించనున్నారు. ఇందులో గ్రూప్​ ఏలో శ్రీలంక, ఐర్లాండ్, నెదర్లాండ్స్​, నమీబియా ఉన్నాయి. గ్రూప్ బీ లో బంగ్లాదేశ్, స్కాట్లాండ్, పపువా న్యూగినియా, ఒమన్ తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాయి.

ఈ క్వాలిఫయర్స్​లోని గ్రూప్​ ఏ విజేత, గ్రూప్ బీ రన్నరప్​ సూపర్ 12 విభాగంలో గ్రూప్​ 1లో వెస్టిండీస్, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్​, దక్షిణాఫ్రికాలతో పోటీపడనున్నాయి. తర్వాత గ్రూప్ బీ విజేత​, గ్రూప్ ఏ రన్నరప్​ సూపర్ 12 విభాగంలో గ్రూప్ 2లోని భారత్, పాకిస్థాన్, అఫ్గానిస్థాన్​, న్యూజిలాండ్​తో పోటీపడతాయి.

ఇవీ చూడండి: రేస్ మధ్యలో అథ్లెట్​ను వెంబడించిన కుక్కలు

Last Updated : Jul 16, 2021, 6:16 PM IST

ABOUT THE AUTHOR

...view details