తెలంగాణ

telangana

ETV Bharat / sports

T20 World Cup: భారత్-పాక్ పోరు.. టీమ్ఇండియాదే జోరు!

టీ20 ప్రపంచకప్​లో(T20 world cup 2021 schedule) భాగంగా భారత్​-పాకిస్థాన్​ మధ్య​ అక్టోబర్​ 24న మ్యాచ్ జరగనుంది. ఈ హైఓల్టేజ్​ మ్యాచ్​లో ఎవరు గెలుస్తారో అని క్రికెట్​ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో గతంలో ఇరు జట్ల మధ్య జరిగిన మ్యాచ్​ ఫలితాలపై ఓ లుక్కేద్దాం.

t20
టీ20

By

Published : Oct 20, 2021, 9:31 AM IST

ఇటీవలే ఐపీఎల్​ ఆనందాన్ని ఆస్వాదించిన క్రీడాభిమానులు.. మరికొద్ది రోజుల్లో ప్రారంభంకాబోయే టీ20 ప్రపంచకప్​(T20 world cup 2021 schedule) అసలు పోటీల కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఎన్ని జట్ల మధ్య మ్యాచ్​ జరిగినా.. చిరకాల ప్రత్యర్థులు భారత్​-పాక్​(team india pakistan cricket match) మధ్య జరిగే పోరంటే ఫ్యాన్స్​కు పండగనే చెప్పాలి. చివరిసారిగా 2019 వన్డే ప్రపంచకప్‌లో పోటీ పడిన ఈ రెండు జట్లు మళ్లీ (pak india match 2021) ఈ మెగాటోర్నీలో బరిలోకి దిగబోతున్నాయి. ఈ నెల 24న ఇరు జట్లు తమ తొలి మ్యాచ్​లో ఒకరినొకరితో తలపడనున్నాయి. దీంతో ఈ మ్యాచ్​ కోసం ప్రపంచంలోని క్రికెట్​ ప్రేమికులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో(pak vs india match schedule) ఈ హై ఓల్టేజ్‌ మ్యాచ్‌లో గెలిచి.. శుభారంభం చేయాలని ఇరుజట్లు పట్టుదలతో ఉన్నాయి. ఈ సందర్భంగా గతంలో భారత్​-పాక్​ మధ్య జరిగిన మ్యాచ్​ ఫలితాలపై ఓ లుక్కేద్దాం..

భారత్​దే పై చేయి

ఈ మెగాటోర్నీ(pakistan india match t20 world cup) చరిత్రలో భారత్‌, పాక్‌ ఇప్పటి వరకు ఐదుసార్లు తలపడగా అన్నింటిలోనూ టీమ్‌ఇండియానే విజయం సాధించింది. 50 ఓవర్ల వరల్డ్ కప్​లోనూ ఏడు సార్లు​ తలపడగా పాకిస్థాన్​ ఇప్పటివరకు భారత జట్టును ఓడించలేదు.

టీ20 ప్రపంచకప్(pak vs india match 2021)

  • 2007 టీ20 ప్రపంచకప్​- గ్రూప్​ మ్యాచ్​-భారత్​ విజయం
  • 2007 టీ20 ప్రపంచకప్​-ఫైనల్​ మ్యాచ్​-5 పరుగులు తేడాతో భారత్​ విజయం
  • 2012 టీ20 ప్రపంచకప్​- సూపర్​ 8​- 8 వికెట్ల తేడాతో భారత్​ విజయం
  • 2014 టీ20 ప్రపంచకప్​- సూపర్​ 10- 7 వికెట్ల తేడాతో భారత్​ విజయం
  • 2016 టీ20 ప్రపంచకప్​- సూపర్​10​- 6 వికెట్ల తేడాతో భారత్​ విజయం

భారతే ఫేవరెట్​

ఈ మ్యాచ్​లో భారత్​ ఫేవరెట్​గా బరిలో దిగుతుండగా.. పాకిస్థాన్​ కూడా బలంగానే కనిపిస్తోంది. యూఏఈ, ఒమన్​ వేదికగా మ్యాచ్​లు జరుగుతుండటం పాకిస్థాన్​కు కలిసి వచ్చే విషయం. కాబట్టి ఆ జట్టు కూడా గట్టి పోటీ నిచ్చే అవకాశాలున్నాయి.

ఇదీ చూడండి: టీ20​ ప్రపంచకప్​ షురూ.. ఇవి తెలుసుకోండి..

ABOUT THE AUTHOR

...view details