ICC T20 Rankings: ఐసీసీ తాజా వన్డే, టీ20 ర్యాంకింగ్స్‌ను బుధవారం విడుదల చేసింది. టీ20లో రాహుల్(4), కోహ్లీ(10) ప్రస్తుతమున్న స్థానాల్లోనే కొనసాగుతున్నారు. బౌలింగ్ విభాగం తొలి పది స్థానాల్లో భారత నుంచి ఎవరూ లేరు. దక్షిణాఫ్రికా బౌలర్ షమ్సీ తొలి స్థానంలో ఉన్నాడు.
ICC T20 Rankings: కోహ్లీ, రోహిత్ అదే స్థానాల్లో.. పంత్ పైపైకి!
ICC T20 Rankings: ఐసీసీ వన్డే, టీ20 ర్యాంకింగ్స్‌లో రాహుల్, కోహ్లీ, రోహిత్ శర్మ ప్రస్తుత స్థానాలను కాపాడుకున్నారు. శ్రేయస్ అయ్యర్, సూర్య కుమార్, పంత్‌లు పాయింట్ల పట్టికలో తమ స్థానాలను మెరుగుపరుచుకున్నారు.
వన్డే ర్యాంకింగ్స్ బ్యాటింగ్ విభాగంలో కోహ్లీ, రోహిత్ శర్మ రెండు, మూడు స్థానాల్లో కొనసాగుతున్నారు. పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజామ్ తొలి స్థానంలో ఉన్నాడు. టీమ్ఇండియా బ్యాటర్లు శ్రేయస్ అయ్యర్, సూర్య కుమార్, పంత్.. తమ స్థానాలను మెరుగుపరుచుకున్నారు. పంత్ 71వ స్థానంలోకి వచ్చాడు. బౌలింగ్ విభాగంలో బుమ్రా ఎప్పటిలాగే ఏడో స్థానంలో కొనసాగుతున్నాడు. న్యూజిలాండ్ బౌలర్ ట్రెంట్ బౌల్డ్ టాప్‌లో ఉన్నాడు. ఆల్ రౌండర్ విభాగంలో బంగ్లాదేశ్ ఆటగాడు షకిబ్ ఉల్ హాసన్ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.