తెలంగాణ

telangana

ETV Bharat / sports

ఐసీసీ ర్యాంకింగ్స్: రెండో స్థానానికి బంగ్లా బౌలర్ హసన్ - అబ్దుర్ రజాక్

ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్​ను అంతర్జాతీయ క్రికెట్ మండలి విడుదల చేసింది. బంగ్లా బౌలర్ మెహిదీ హసన్ రెండో ర్యాంకులో నిలిచాడు. షకిబుల్ హసన్, అబ్దుర్ రజాక్ తర్వాత బంగ్లా తరఫున తొలి రెండు స్థానాల్లో నిలిచిన మూడో బౌలర్​గా హసన్ నిలిచాడు.

Mehidy Hasan, bangladesh bowler
మెహిదీ హసన్, బంగ్లాదేశ్ బౌలర్

By

Published : May 26, 2021, 3:30 PM IST

వన్డే ర్యాంకింగ్స్​ను అంతర్జాతీయ క్రికెట్ మండలి ప్రకటించింది. తాజా ర్యాంకింగ్స్​లో బంగ్లాదేశ్​ బౌలర్ మెహిదీ హసన్​ రెండో స్థానానికి చేరుకున్నాడు. బంగ్లా తరఫున తొలి రెండు స్థానాల్లో నిలిచిన మూడో బౌలర్ హసన్. ఇక ఈ విభాగంలో కివీస్ బౌలర్ ట్రెంట్ బౌల్ట్​ తొలి స్థానంలో ఉండగా.. టీమ్​ఇండియా బౌలర్​ బుమ్రా.. ఐదో స్థానంలో ఉన్నాడు.

స్వదేశంలో శ్రీలంకతో జరుగుతున్న మూడు మ్యాచ్​ల వన్డే సిరీస్​లో.. హసన్ అత్యుత్తమ ప్రదర్శన కనపరిచాడు. తొలి మ్యాచ్​లో 30 పరుగులిచ్చి 4 వికెట్లు తీసిన హసన్.. తర్వాత మ్యాచ్​లో 28 పరుగులకు 3 వికెట్లు పడగొట్టాడు.

ఇదీ చదవండి:ఈ వివక్షను పూర్తిగా తొలగించాలి: హోల్డింగ్

2009లో బంగ్లా ఆల్​రౌండర్​ షకిబుల్ హసన్ అగ్రస్థానాన్ని దక్కించుకోగా.. 2010లో అబ్దుర్​ రజాక్​ రెండో స్థానంలో నిలిచాడు. వీరిద్దరి తర్వాత టాప్​-2లో నిలిచిన బంగ్లా బౌలర్​ మెహిదీ హసన్.

మరో బంగ్లా బౌలర్​ ముస్తాఫిజుర్ రెహ్మాన్ కూడా మెరుగయ్యాడు. రెండు మ్యాచ్​ల్లో కలిపి 6 వికెట్లు తీసిన అతడు.. ఏకంగా ఎనిమిది స్థానాలు ఎగబాకి తొమ్మిదో స్థానాన్ని కైవసం చేసుకున్నాడు. 2018లో అతడు కెరీర్​లో ఉత్తమంగా 5వ స్థానంలో నిలిచాడు.

ఇక బ్యాటింగ్​ విషయానికొస్తే రెండు మ్యాచ్​ల్లోనూ మ్యాన్​ ఆఫ్ ది మ్యాచ్​గా నిలిచిన ముష్ఫికర్​​ రహీమ్​.. నాలుగు స్థానాలు పుంజుకొని 14వ స్థానాన్ని దక్కించుకున్నాడు. మరో బంగ్లా ఆటగాడు మహ్మదుల్లా 38వ స్థానంలో ఉన్నాడు. ​

ఇదీ చదవండి:డబ్ల్యూటీసీ ఫైనల్:​ డ్రా అయితే ఫలితం ఎలా?

ABOUT THE AUTHOR

...view details