తెలంగాణ

telangana

ETV Bharat / sports

ICC Latest ODI Rankings Kohli : అదరగొట్టిన కోహ్లీ - కేెఎల్ రాహుల్​.. ఏకంగా.. - kl rahul kohli rankings latest

ICC Lates Odi Rankings Kohli : ఐసీసీ తాజా వన్డే ర్యాంకింగ్స్​లో టీమ్​ ఇండియా ప్లేయర్లు అదరగొట్టారు. ముఖ్యంగా కేఎల్ రాహుల్​ - కోహ్లీ మంచిగా రాణించారు. ఆ వివరాలు..

ICC Lates Odi Rankings Kohli
ICC Lates Odi Rankings Kohli

By ETV Bharat Telugu Team

Published : Oct 11, 2023, 5:01 PM IST

ICC Lates Odi Rankings Kohli : టీమ్​ ఇండియా స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లీ ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో దూసుకెళ్లాడు. వన్డే ప్రపంచ కప్​ -2023లో ఆస్ట్రేలియాతో ఆరంభ మ్యాచ్‌లో సూపర్​ ఇన్నింగ్స్‌ ఆడిన అతడు.. మూడు స్థానాలు ఎగబాకి ఏడో ర్యాంకుకు చేరుకున్నాడు. ఇంకా ఈ వరల్డ్​ కప్‌ మ్యాచ్‌లలో శతకాలతో ఆకట్టుకున్న దక్షిణాఫ్రికా స్టార్‌ ఓపెనర్‌ క్వింటన్‌ డికాక్‌, ఇంగ్లాండ్​ ఓపెనింగ్‌ బ్యాటర్‌ డేవిడ్‌ మలన్‌ కూడా తమ స్థానాలు మెరుగుపరుచు కోవడం విశేషం.

ఇదే ర్యాంకింగ్స్​లో వన్డే వరల్డ్‌ నెం.1 బ్యాటర్‌, పాకిస్థాన్ కెప్టెన్‌ బాబర్‌ ఆజం తన అగ్రస్థానాన్ని కాపాడుకున్నాడు. టీమ్​ ఇండియా యంగ్​ ఓపెనర్‌ శుభమన్​ గిల్‌ కూడా రెండో స్థానంలోనే కొనసాగుతున్నాడు. అలాగే దక్షిణాఫ్రికా బ్యాటర్‌ రాసీ వాన్‌ డెర్‌ డసెన్‌, ఐర్లాండ్‌ స్టార్‌ హ్యారీ టెక్టార్‌, ఆసీస్‌ వెటరన్‌ ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌ టాప్‌-5లో కొనసాగుతున్నారు. శ్రీలంకతో మ్యాచ్‌లో క్వింటన్‌ డికాక్‌ సెంచరీ బాదగా.. కోహ్లీ ఆసీస్‌పై 85 పరుగులు చేశాడు. వీరిద్దరు వరుసగా 6, 7 స్థానాల్లో నిలిచారు. ఇంగ్లాండ్​ ఓపెనర్‌ డేవిడ్‌ మలన్‌ బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో విధ్వంసకర శతకం(140) బాది.. ఏకంగా ఏడు స్థానాలు ఎగబాకి ఎనిమిదో ర్యాంకులో నిలిచాడు.

Kl Rahul Latest ODI Rankings : ఇకపోతే టీమ్ ఇండియా బ్యాటర్‌ కేఎల్‌ రాహుల్‌ 15 స్థానాలు మెరుగుపరచుకుని.. 19వ ర్యాంకుకు చేరుకున్నాడు. సొంతగడ్డపై ఆరంభ మ్యాచ్‌లో ఆస్ట్రేలియాపై అద్భుతంగా రాణించిన ఈ వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌.. కేవలం మూడు పరుగుల తేడాతో శతకాన్ని చేజార్చుకున్నాడు. అలాగే గిల్‌ కూడా అనారోగ్యం కారణంగా జట్టుకు దూరమై నెంబర్​.1గా అవతరించే ఛాన్స్​ను మిస్ చేసుకున్నాడు. ఇక కోహ్లీ - కేెఎల్ రాహుల్​ ర్యాంకింగ్స్ విషయం తెలుసుకుంటున్న క్రికెట్​ అభిమానులు తెగ సంతోషపడిపోతున్నారు.

ఐసీసీ వన్డే బ్యాటింగ్‌ ర్యాంకింగ్స్‌ టాప్‌-5 బ్యాటర్స్​..

1. బాబర్‌ ఆజం(పాకిస్థాన్)

2. శుబ్‌మన్‌ గిల్‌(భారత్‌)

3. రాసీ వాన్‌ డెర్‌ డసెన్‌(సౌతాఫ్రికా)

4. హ్యారీ టెక్టర్‌(ఐర్లాండ్‌)

5. డేవిడ్‌ వార్నర్‌(ఆస్ట్రేలియా).

Ind vs Aus World Cup 2023 : కోహ్లీ-కేఎల్ రాహుల్​ సూపర్ షో.. ప్రపంచకప్​లో టీమ్​ఇండియా శుభారంభం

Rohit Sharma World Cup : ప్రపంచ రికార్డుకు అతి దగ్గరలో 'హిట్​మ్యాన్'.. రోహిత్ దరిదాపుల్లో కూడా ఎవరు లేరుగా!

ABOUT THE AUTHOR

...view details