వచ్చే ఏడాది బర్మింగ్‌హామ్ వేదికగా జరగనున్న కామన్వెల్త్ క్రీడల్లో.. మహిళ క్రికెట్ నుంచి ఆరు అర్హత జట్లను వెల్లడించింది అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ). కామన్వెల్త్ గేమ్స్ సమాఖ్యతో కలిసి అధికారిక ప్రకటన చేసింది. 2022 జులై 28 నుంచి ఆగష్టు 8 వరకు ఈ ప్రతిష్టాత్మక పోటీలు జరగనున్నాయి.
ఈ పోటీల కోసం మొత్తం 8 జట్లను ప్రకటించాల్సి ఉంది. క్రీడలకు ఆతిథ్యమిస్తున్నందుకు ఇంగ్లాండ్.. క్రికెట్ నుంచి స్థానం దక్కించుకుంది. ఆస్ట్రేలియా, ఇండియా, న్యూజిలాండ్, పాకిస్థాన్, దక్షిణాఫ్రికాతో పాటు వెస్టిండీస్ నుంచి ఓ జట్టు ఈ అర్హత జట్లలో స్థానం దక్కించుకున్నాయి. వీటన్నింటినీ 2021 ఏప్రిల్ 1 వరకు టీ20ల్లో ఉన్న ర్యాంకుల ఆధారంగా నిర్ణయించారు. మరో టీమ్‌ను వచ్చే ఏడాది జనవరి 31న ప్రకటించనున్నారు.