తెలంగాణ

telangana

ETV Bharat / sports

MS Dhoni IPL 2023: ఐపీఎల్​ 2023లో ఆడటంపై ధోనీ క్లారిటీ - ఐపీఎల్ 2023

MS Dhoni IPL 2023: చెన్నైసూపర్​ కింగ్స్​ అభిమానులకు గుడ్​ న్యూస్ చెప్పాడు సారథి మహేంద్ర సింగ్ ధోనీ. ఐపీఎల్​ 2023లో ఆడనున్నట్లు స్పష్టంచేశాడు.

MS Dhoni ipl 2023
ms dhoni latest news

By

Published : May 20, 2022, 8:29 PM IST

MS Dhoni IPL 2023: వచ్చే ఐపీఎల్​ సీజన్​లో ఆడతానని స్పష్టం చేశాడు చెన్నైసూపర్ కింగ్స్ సారథి మహేంద్ర సింగ్ ధోనీ. శుక్రవారం రాజస్థాన్​ రాయల్స్​తో మ్యాచ్​లో టాస్ సందర్భంగా ఈ మేరకు వెల్లడించాడు మహీ. ఈ సీజన్​లో సీఎస్​కేకు ఇదే ఆఖరి మ్యాచ్​. ధోనీ సారథ్యంలో నాలుగు సార్లు టైటిల్ గెలిచిన ఆ జట్టు ఈ సారి ప్లేఆఫ్స్​ చేరుకోలేకపోయింది.

"కచ్చితంగా వచ్చే సీజన్​లో ఆడతా. ఎందుకంటే.. చెన్నైలో ఆడి.. అక్కడి అభిమానులకు థ్యాంక్యూ చెప్పకుండా వెళ్లడం సరికాదు. ముంబయితో నాకు మంచి అనుబంధమే ఉంది. అయితే సీఎస్​కే అభిమానుల పట్ల అలా చేయకూడదు"

-ఎంఎస్ ధోనీ, సీఎస్​కే కెప్టెన్

వచ్చే ఏడాది భిన్న వేదికల్లో మ్యాచ్​లు జరగాలని ఆశిస్తున్నట్లు చెప్పాడు ధోనీ. "భిన్న వేదికల్లో మ్యాచ్​లు జరిగితే ఆయా ప్రాంతాల వారికి ధన్యవాదాలు చెప్పుకునే అవకాశం లభిస్తుంది. అయితే అదే నా చివరి ఏడాది అని చెప్పడం కష్టం. ఎందుకంటే రాబోయే రెండేళ్లలో ఏం జరుగుతుందో ఎవరూ అంచనా వేయలేరు. అయితే వచ్చే ఏడాది గట్టిగా తిరిగొచ్చేందుకు బాగా కష్టపడతా" అని ధోనీ చెప్పాడు.

ఇదీ చూడండి:అభిమాని లేఖకు ధోనీ ఫిదా.. రిప్లై ఏమిచ్చాడంటే..

ABOUT THE AUTHOR

...view details