తన కెరీర్‌ను తీర్చిదిద్దడంలో కివీస్ మాజీ బౌలర్ షేన్ బాండ్ ప్రముఖ పాత్ర పోషించాడని టీమ్ఇండియా పేసర్ జస్ప్రీత్ బుమ్రా తెలిపాడు. బాండ్ ప్రస్తుతం ముంబయి ఇండియన్స్‌కు బౌలింగ్ కోచ్‌గా వ్యవహరిస్తున్నాడు.
రానున్న ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో భారత బౌలింగ్ దళానికి నాయకత్వం వహించనున్న బుమ్రా.. తన అభిప్రాయాలను ఓ వీడియో ద్వారా వెల్లడించాడు.
"నేను ఎక్కడ ఉన్నా.. షేన్ బాండ్‌తో మాట్లాడటానికి ప్రయత్నిస్తాను. అతడి నుంచి ఎప్పుడూ ఏదో కొత్త విషయం నేర్చుకుంటూనే ఉంటాను. ప్రతి ఏడాది నా బౌలింగ్‌లో కొత్త అస్త్రాలను జోడించడానికి ప్రయత్నిస్తుంటాను. ఇప్పటివరకు అతడితో గొప్ప అనుబంధం ఉంది. ఇది మున్ముందు కూడా కొనసాగుతుంది. నా కెరీర్‌ను తీర్చిదిద్దడంలో బాండ్ ప్రముఖ పాత్ర పోషించాడు."