"కరోనా నెగెటివ్ వచ్చినా ఇప్పటికీ బలహీనంగా అనిపిస్తుండడం వల్ల ఇంకా శిక్షణ మొదలుపెట్టలేకపోతున్నాను" అని కోల్కతా నైట్ రైడర్స్ ఆఫ్ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి అన్నాడు. ఈసారి ఐపీఎల్ లో కరోనా సోకిన తొలి ఆటగాడు వరుణే. కరోనా నుంచి కోలుకున్న ఈ 29 ఏళ్ల స్పిన్నర్ ప్రస్తుతం చెన్నైలోని తన ఇంట్లో ఉన్నాడు.
"ప్రస్తుతం ఇంటి దగ్గరే ఉన్నా, కొవిడ్ తర్వాత ఎదురయ్యే అనారోగ్య సమస్యల కారణంగా ఇప్పటికీ పూర్తిస్థాయిలో శిక్షణ మొదలు పెట్టలేకపోతున్నా. నాకేమీ జ్వరం, దగ్గు లేవు. కానీ చాలా బలహీనంగా, మత్తుగా అనిపిస్తోంది. వాసన, రుచి కోల్పోయినట్టు ఇప్పటికీ అప్పుడప్పుడు అనిపిస్తోంది. కానీ త్వరలోనే మళ్లీ శిక్షణ కొనసాగిస్తాననే నమ్మకంతో ఉన్నాను" అని వరుణ్ చెప్పాడు.