టీమ్ఇండియా ప్రస్తుత కెప్టెన్ విరాట్ కోహ్లీ.. 2014 ఇంగ్లాండ్ పర్యటనలో బ్యాట్స్‌మన్‌గా గడ్డు పరిస్థితులు ఎదుర్కొన్నాడు. నాటి ఒడుదొడుకులను ఎలా అధిగమించాడనే విషయాలను ఇప్పుడు వివరించాడు. దిగ్గజ క్రికెటర్ సచిన్ తెందుల్కర్ తనకు కీలక సూచనలు చేశారని వెల్లడించాడు.
ఇంగ్లాండ్‌తో ఐదు టెస్టుల సిరీస్‌లో వరుసగా 1, 8, 25, 0, 39, 28, 0, 7, 6, 20 పరుగులు చేశాడు కోహ్లీ. పది ఇన్నింగ్స్‌ల్లో 13.40 సగటుతో 134 పరుగులు మాత్రమే చేయగలిగాడు. తర్వాత ఆసీస్‌తో టెస్టు సిరీస్‌లో తిరిగి ఫామ్ అందుకున్నాడు విరాట్. అందులో మొత్తంగా 692 పరుగులు సాధించాడు. ఇదంతా సచిన్ సలహాలతోనే సాధ్యమైందని తెలిపాడు కోహ్లీ. తెందుల్కర్ సూచనలతోనే మిచెల్ జాన్సన్ వంటి ఫాస్ట్ బౌలర్లను సమర్థంగా ఎదుర్కొన్నట్లు పేర్కొన్నాడు.