డిఫెండింగ్ ఛాంపియన్ వెస్టిండీస్ జట్టు.. టీ20 ప్రపంచకప్‌లో పేలవ ప్రదర్శన చేసింది. సెమీస్ కూడా చేరకుండానే వెనుదిరిగింది. అయితే ఈ మెగా టోర్నీలో భాగంగా స్టార్ ఆల్‌రౌండర్ డ్వేన్ బ్రావో(bravo retirement) అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. యూనివర్స్ బాస్ క్రిస్ గేల్(chris gayle news) కూడా క్రికెట్‌కు వీడ్కోలు పలికినట్లు ప్రవర్తించాడు. ఇప్పుడు ఈ విషయమై క్లారిటీ ఇస్తూ ట్వీట్ చేశాడు.
'ఇప్పుడప్పుడే జట్టును విడిచివెళ్లను' అని గురువారం ట్విట్టర్ వేదికగా క్రిస్ గేల్ రాసుకొచ్చాడు. అయితే టీ20 ప్రపంచకప్ చివరి మ్యాచ్ అనంతరం.. జమైకాలో చివరి మ్యాచ్ ఆడిన తర్వాతే రిటైర్మెంట్పై ఆలోచిస్తానని అన్నాడు. సొంత అభిమానుల సమక్షంలోనే గుడ్‌బై చెప్పాలని ఆశాభావం వ్యక్తం చేశాడు.
దాదాపు 22 ఏళ్ల పాటు క్రికెట్ ఆడిన గేల్.. 79 టీ20లు, 103 టెస్టులు, 301 వన్డేలు ఆడాడు. మూడు ఫార్మాట్లలో పరుగుల విధ్వంసం సృష్టించాడు.