భారత క్రికెట్ చరిత్రలో మరో అద్భతం జరిగింది. టీమ్ఇండియా.. మూడో అంధుల టీ20 వరల్డ్ కప్‌ను సొంతం చేసుకుంది. బెంగుళూరు చిన్నస్వామీ క్రికెట్ స్టేడియం వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన ఫైనల్లో 120 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి ప్రపంచ కప్‌ను ముద్దాడింది. దీంతో వరుసగా మూడు సార్లు కప్‌ను గెలిచి హ్యాట్రిక్ నమోదు చేసింది.
టీమ్ఇండియా హ్యాట్రిక్.. మూడోసారి టీ20 వరల్డ్‌కప్‌ను ముద్దాడిన మనోళ్లు
భారత అంధుల క్రికెట్ జట్టు మరో ఘనత సాధించింది. బెంగళూరు వేదికగా జరిగిన మూడో అంధుల క్రికెట్ వరల్డ్ ఫైనల్లో బంగ్లాపై ఘన విజయం సాధించింది. ఈ విజయంతో వరుసగా మూడు సార్లు ప్రపంచ కప్పును ముద్దాడి హ్యాట్రిక్ రికార్డు సృష్టించింది.
మొదట టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమ్ఇండియా.. నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 277 పరుగులు చేసింది. సునీల్ రమేశ్ (136*), అజయ్ కుమార్ రెడ్డి(100*) చేలరేగి పోయారు. ఓపెనర్లు లలిత్ మీనా(0), వెంకటేశ్వర రావు(10) పరుగులు చేశారు. బంగ్లా బౌలర్ సల్మాన్(2) వికెట్లు పడగొట్టాడు.
ఆ తర్వాత బరిలోకి దిగిన బంగ్లాదేశ్.. మొదటి నుంచే తడబడింది. నిర్ణీత ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 157 పరుగుల వద్ద కుప్ప కూలింది. బౌలింగ్‌లో రాణించిన సల్మాన్.. (77*) పరుగులు చేసి జట్టును ఆదుకున్నాడు. ఎండీ ఆశికర్ రహ్మాన్(21), అబిద్(18), ఆరిఫ్ ఉల్లా(22), ఫర్వాలేదనిపించారు. మహ్మద్ రెస్వే హసన్(1*) పరుగులు చేశాడు. లలిత్ మీనా, అజిత్ కుమార్ రెడ్డి చెరో వికెట్ చొప్పున పడగొట్టారు.