తెలంగాణ

telangana

ETV Bharat / sports

టెస్టుల్లోనూ వీర బాదుడు.. అత్యధిక సిక్సర్ల వీరులు వీళ్లే.. - డేవిడ్​ వార్నర్

Highest sixers in tests: టెస్టు మ్యాచ్​.. ఐదురోజుల పాటు సుదీర్ఘంగా సాగుతుంది. ఈ క్రమంలో బ్యాటర్లు పరుగులు చేయాలన్నా, బౌలర్లు వికెట్లు పడగొట్టాలన్నా గంటల తరబడి ఆడాలి. అభిమానుల ఆదరణ కాస్త తగ్గడం వల్ల ఐసీసీ.. ప్రపంచ ఛాంపియన్​షిప్​ రూపంలో మ్యాచ్​లు నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం అంతర్జాతీయ క్రికెట్​ ఆడుతున్న ఆటగాళ్లలో అత్యధిక సిక్సర్లు కొట్టిన ప్లేయర్ల వివరాలు ఓ సారి పరిశీలిద్దాం..

అత్యధిక సిక్సర్లు
highest sixers by cricketers

By

Published : Mar 11, 2022, 1:05 PM IST

Highest sixers in tests: టెస్టు క్రికెట్‌ అంటేనే సుదీర్ఘమైన ఆట. ఐదు రోజుల పాటు ఇరు జట్లు పోటాపోటీగా తలపడి చివరికి ప్రత్యర్థిని రెండుసార్లు తమకన్నా తక్కువ స్కోరుకే ఆలౌట్‌ చేయాలి. ఈ క్రమంలో బ్యాటర్లు పరుగులు చేయాలన్నా, బౌలర్లు వికెట్లు తీయాలన్నా గంటల తరబడి మైదానంలో పోరాడాలి. అయితే, ఇలాంటి ఆటను చూడటానికి కొన్నేళ్ల క్రితం అభిమానులు పెద్దగా ఆసక్తి చూపలేదు. దాంతో ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ లాంటి మెగా ఈవెంట్‌లను ఐసీసీ నిర్వహిస్తోంది. క్రమంగా సుదీర్ఘ ఫార్మాట్​కు కూడా ఆదరణ పెరుగుతోంది. అయితే టెస్టుల్లో కూడా కొందరు ఆటగాళ్లు వన్డేలు, టీ20 మ్యాచ్​ల్లా బౌండరీలు, సిక్సర్లు బాదుతుంటారు. వేగంగా పరుగులు చేస్తుంటారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం అంతర్జాతీయ క్రికెట్​ ఆడుతున్న ఆటగాళ్లలో టెస్టు మ్యాచుల్లో అత్యధిక సిక్సులు కొట్టిన వారెవరు? ఎన్ని కొట్టారు? తెలుసుకుందాం..

బెన్​ స్టోక్స్​:

ఇంగ్లండ్​ ఆటగాడు బెన్​ స్టోక్స్​ ప్రస్తుతం జట్టుకు వైస్​ కెప్టెన్​గా వ్యవహరిస్తున్నాడు. ఈ ఆల్​రౌండర్​ మొత్తం టెస్టు ఫార్మాట్​లో 83 సిక్సులను బాది అత్యధిక సిక్సులు కొట్టిన వారి జాబితాలో అగ్రస్థానంలో నిలిచాడు. మొత్తం 77 టెస్టు మ్యాచులు ఆడిన స్టోక్స్​ 10 సెంచరీలను తన ఖాతాలో వేసుకున్నాడు.

బెన్​ స్టోక్స్​

టిమ్​ సౌథీ:

న్యూజిలాండ్​ జట్టు ఆల్​రౌండర్​​ టిమ్​ సౌథీ అత్యధిక సిక్సులు కొట్టిన వారి జాబితాలో రెండో స్థానంలో ఉన్నాడు. మొత్తం 85 మ్యాచులు ఆడిన సౌథీ 75 సిక్సులు బాదాడు.

టిమ్​ సౌథీ

ఏంజిలో మాథ్యూస్:​

శ్రీలంక ఆల్​ రౌండర్​ ఏంజిలో మాథ్యూస్​ టెస్టు ఫార్మాట్​లో 93 మ్యాచులు ఆడి 69 సిక్సులు కొట్టి మూడో స్థానంలో ఉన్నాడు. ఇప్పటివరకు టెస్టుల్లో 11 సెంచరీలను సాధించాడు​.

ఏంజిలో మాథ్యూస్​

రోహిత్​ శర్మ:

రోహిత్​ బ్యాటింగ్ మెరుపులు చూసిన అభిమానులు ఇతడికి ముద్దుగా 'హిట్​మ్యాన్' అని పేరు పెట్టారు. ఇప్పటివరకు 63 టెస్టు మ్యాచులు ఆడిన ఇతడు 44 సిక్సులు బాదాడు. అలాగే ఈ ఫార్మాట్​లో ఎనిమిది సెంచరీలు చేశాడు.

రోహిత్​ శర్మ

డేవిడ్​ వార్నర్​:

ఆస్ట్రేలియా స్టార్​ ఓపెనర్​ డేవిడ్​ వార్నర్​ 2011లో న్యూజిలాండ్​తో జరిగిన టెస్టు మ్యాచ్​తో అరంగ్రేటం చేశాడు. ఇప్పటివరకు 92 టెస్టు మ్యాచులు ఆడిన వార్నర్​ 58 సిక్సులు బాదాడు. ఈ ఫార్మాట్​లో 24 సెంచరీలు సాధించాడు.

డేవిడ్​ వార్నర్​

రిటైర్​ అయిన ఆటగాళ్లలో అత్యధిక సిక్సర్లు కొట్టిన వారి జాబితా

ఆటగాడు మ్యాచులు సిక్సర్లు సెంచరీలు
బ్రెండన్​ మెక్​కల్లమ్​(న్యూజిలాండ్​) 101 107 12
అడమ్​ గిల్​క్రిస్ట్(ఆస్ట్రేలియా)​ 96 100 17
క్రిస్​ గేల్​(వెస్టిండీస్​) 103 98 15
జాక్వస్​ కల్లిస్​(దక్షిణాఫ్రికా) 166 97 45
వీరెేంద్ర సెహ్వాగ్​(భారత్​) 104 91 23
బ్రయాన్​ లారా(వెస్టిండీస్) 131 88 34
క్రిస్​ కెయిర్న్స్​(న్యూజిలాండ్​) 62 87 05
వీవీ రిచర్డ్స్​(వెెస్టిండీస్​) 121 84 24



ఇదీ చదవండి:IPL 2022: వీరి ఆట చూసి తీరాల్సిందే!

ABOUT THE AUTHOR

...view details