అంతర్జాతీయ క్రికెట్‌లో ఎంతో అనుభవం సంపాదించిన బంగ్లాదేశ్‌కు స్కాట్లాండ్ జట్టు షాక్ ఇచ్చింది (పూర్తి కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి). టీ20 ప్రపంచకప్(t20 world cup 2021)లో భాగంగా సూపర్-12 దశకు ముందు జరుగుతున్న క్వాలిఫయింగ్ రౌండ్‌లో స్కాట్లాండ్ జట్టు బంగ్లాదేశ్(sco vs ban t20)ను ఓడిచింది. ఈ మ్యాచ్‌లో స్కాట్లాండ్ ఆటగాడు క్రిస్ గ్రీవ్స్(chris greaves stats) 28 బంతుల్లో 45 పరుగులు చేసి జట్టుకు విజయాన్నందించాడు. తాజాగా మ్యాచ్ అనంతరం మాట్లాడిన ఈ జట్టు కెప్టెన్ కైల్ కోట్జర్.. గ్రీవ్స్ గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. తన జీవితంలో అతడు ఎన్నో కష్టాలు పడ్డాడని తెలిపాడు.
"జీవితంలో అతడు (క్రిస్ గ్రీవ్స్) చాలా త్యాగాలు చేశాడు. కొన్ని నెలల క్రితం అతడు అమెజాన్‌లో పార్సిల్స్ డెలివరీ చేసేవాడు. ఇప్పుడు బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్‌గా ఎంపికయ్యాడు. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. ప్రాక్టీస్‌లో చాలా కష్టపడతాడు. అతడిని చూసి మేము చాలా గర్విస్తున్నాం "