తెలంగాణ

telangana

ETV Bharat / sports

'కొత్త శకం మొదలైంది'.. బీసీసీఐ నిర్ణయంపై క్రికెట్‌ దిగ్గజాల హర్షం - బిసీసీఐ నిర్ణయంపై క్రికెటర్ల హర్షం

బీసీసీఐ తాజా నిర్ణయంపై టీమ్‌ఇండియా మహిళా జట్టు కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ హర్షం వ్యక్తం చేసింది. పురుషులతో సమానంగా మహిళా క్రికెటర్లకు వేతనాలు ఇవ్వాలని నిర్ణయించిన ఈ రోజును చరిత్రలో గుర్తుండిపోయేదిగా అభివర్ణించింది.

sports
sports

By

Published : Oct 27, 2022, 10:52 PM IST

బీసీసీఐ తాజా నిర్ణయంపై టీమ్‌ ఇండియా మహిళా జట్టు కెప్టెన్‌ హర్మన్‌ ప్రీత్‌ కౌర్‌ హర్షం వ్యక్తం చేసింది. పురుషులతో సమానంగా మహిళా క్రికెటర్లకు వేతనాలు ఇవ్వాలని నిర్ణయించిన ఈ రోజును చరిత్రలో గుర్తుండిపోయేదిగా అభివర్ణించింది. భవిష్యత్తులో అమ్మాయిలు క్రికెట్‌ను కెరీర్‌గా ఎంచుకునే పరిస్థితులు కల్పించడం శుభపరిణామంగా పేర్కొంది.

"మహిళా క్రికెట్‌లో నిజంగా ఈరోజు చిరస్మరణీయమైంది. క్రికెట్‌లో సమాన వేతనాన్ని ప్రకటించిన జయ్‌షా, బీసీసీఐకి కృతజ్ఞతలు" అంటూ ట్వీట్‌ చేసింది. ఇది ఆహ్వానించదగ్గ పరిణామమని, భారత్‌లో తొలిసారి ఇటువంటి విధానం అమలు చేయడం సంతోషంగా ఉందని తెలిపింది. కచ్చితంగా భవిష్యత్తులో మహిళా క్రికెట్‌కు మరింత ప్రాధాన్యం పెరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేసింది. మరోవైపు క్రికెట్‌ దిగ్గజాలు సైతం దీనిపై స్పందించారు.

"క్రీడల నుంచి లింగ వివక్షను దూరం చేసేందుకు మరో అడుగు పడింది. బీసీసీఐ నిర్ణయం నిజంగా హర్షించదగ్గది. భారత్ ఈ విధంగా ముందుకెళ్లడం చూస్తుంటే గొప్పగా అనిపిస్తుంది" -సచిన్‌ తెందూల్కర్‌

"మహిళా క్రికెట్‌కు సంబంధించి ఈరోజు అద్భుతమైన వార్త విన్నాను"-స్మృతి మంధాన

"కొత్త శకం మొదలైంది. ఇదో చారిత్రక నిర్ణయం. రానున్న ఏడాది మహిళల భారత క్రికెట్‌ లీగ్‌.. ఇప్పుడు సమాన వేతనాలు. చాలా సంతోషంగా ఉంది. బీసీసీఐ, జైషాకు కృతజ్ఞతలు" -మిథాలీ రాజ్‌

ఇదీ చడవండి:'టీ20ల నుంచి కోహ్లీ రిటైర్‌ అవ్వాలి.. అలాగైతేనే అది సాధ్యం'

T20 worldcup: రోహిత్​ శర్మ ఎందుకలా చేస్తున్నాడో

ABOUT THE AUTHOR

...view details