Hardik Pandya World Cup 2023 : ప్రపంచకప్‌లో భాగంగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టీమ్ఇండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య గాయపడ్డాడు. ఎడమ మోకాలి నొప్పితో విలవిల్లాడుతూ గ్రౌండ్‌లోనే కుప్పకూలాడు. అతడిని ఫిజియోలు వచ్చి పరిశీలించారు. మోకాలికి టేప్ వేశారు. అయినప్పటికీ హార్దిక్ నొప్పి తగ్గలేదు. దీంతో అతడిని ఫీల్డ్ నుంచి బయటకు తీసుకెళ్లారు.
ఇక హార్దిక్ గాయంపై తాజాగా బీసీసీఐ స్పందించింది. ప్రస్తుతం హార్దిక్ పాండ్యా గాయాన్ని పరిశీలించి అతన్ని స్కానింగ్ కోసం తీసుకువెళ్తున్నట్లు ఓ ప్రకటనలో పేర్కొంది. అయితే హార్దిక్‌కు పెద్ద గాయమేం కాలేదని మ్యాచ్ అనంతరం కెప్టెన్ రోహిత్ శర్మ వెల్లడించాడు. కానీ తర్వాతి మ్యాచ్‌కు అతడు అందుబాటులో ఉంటాడా లేడా అన్న విషయాన్ని స్పష్టం చేయలేదు.
అసలేం జరిగింది :
ఇన్నింగ్స్ తొమ్మిదో ఓవర్లో ఈ ఘటన జరిగింది. మూడో బాల్ వేస్తున్న సమయంలో బంగ్లా ప్లేయర్ లిటన్ దాస్.. ఓ సూపర్ స్ట్రైట్ డ్రైవ్‌ను కొట్టాడు. ఇది గమనించిన హార్దిక్.. ఆ బాల్‌ను తన కుడి కాలితో ఆపేందుకు ప్రయత్నించాడు. దీంతో అనుకోకుండా అతను కింద పడ్డాడు. అయితే లేచి నిల్చునేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో హార్దిక్ కాస్త ఇబ్బంది పడ్డాడు. దీంతో ఫిజియో సిబ్బంది వచ్చి అతడ్ని పెవిలియన్‌కు తీసుకెళ్లారు. అయితే హార్దిక్ అప్పటికే తొమ్మిదో ఓవర్లో 3 బంతులు వేయగా.. మిగిలిన ఓవర్‌ను విరాట్ కోహ్లీ పూర్తి చేశాడు. ఈ క్రమంలో హార్దిక్ స్థానంలో ఫీల్డింగ్‌లోకి సూర్యకుమార్ యాదవ్‌ను దింపారు.
అతడు దూరమైతే..: గాయం కారణంగా హార్దిక్ పాండ్య దూరమైతే అది టీమ్‌ఇండియాకు పెద్ద దెబ్బే. గత కొంతకాలంగా నిలకడగా రాణిస్తున్న హార్దిక్.. బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్‌లో రాణిస్తూ ఆల్‌రౌండర్ పాత్రను సమర్థంగా పోషిస్తున్నాడు. బ్యాటింగ్‌లో ఇప్పటివరకూ టాప్‌ఆర్డర్ రాణించడం వల్ల హార్దిక్ పెద్దగా కష్టపడాల్సిన పనిలేకుండా పోయింది. ఒకవేళ టాప్‌ఆర్డర్ విఫలమైతే మిడిలార్డర్‌లో హార్దిక్ లాంటి బ్యాటర్ అవసరం జట్టుకు ఉంటుంది. బౌలింగ్‌లోనూ హార్దిక్ భారత్‌కు ఎంతో అవసరం.