టీ20 ప్రపంచకప్(T20 World Cup 2021) అసలు మ్యాచ్‌లు ప్రారంభమయ్యే లోపు టీమ్ఇండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా(Hardik Pandya News) బౌలింగ్ చేసేందుకు సిద్ధమవుతాడని ఆశిస్తున్నట్లు వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ(Rohith Sharma on Hardik Pandya) తెలిపాడు. హార్దిక్ ఫామ్‌పై పలువురు సీనియర్ క్రికెటర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో రోహిత్ వ్యాఖ్యలకు ప్రాధాన్యం ఏర్పడింది.
"హార్దిక్ ఆటతీరు క్రమంగా మెరుగవుతోంది. కానీ, అతడు ఇంకా బౌలింగ్ చేయడం ప్రారంభించలేదు. టోర్నీ ప్రారంభమయ్యేలోపు హార్దిక్ బౌలింగ్ చేసేందుకు సిద్ధమవ్వాలి. జట్టులో మేటి బౌలర్లున్నారు. అయినప్పటికీ.. జట్టులో ఆరో బౌలర్ ఉండటం చాలా ముఖ్యం."
-రోహిత్ శర్మ, వైస్ కెప్టెన్.