Harbhajan singh: దక్షిణాఫ్రికాలో ఇప్పటివరకు ఒక్క టెస్టు సిరీస్ కూడా గెలవని టీమ్‌ఇండియా.. ఈసారి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నాడు వెటరన్ స్పిన్నర్ హర్భజన్‌సింగ్. దక్షిణాఫ్రికా పర్యటన.. భారత్‌కు బంగారు అవకాశమని అన్నాడు. మరికొద్ది రోజుల్లో భారత జట్టు అక్కడికెళ్లి మూడు టెస్టులు, మూడు వన్డేలు ఆడనున్న నేపథ్యంలో స్పిన్ దిగ్గజం యూట్యూబ్ ఛానల్లో మాట్లాడుతూ తన అభిప్రాయాలు పంచుకున్నాడు. ప్రస్తుతం సఫారీ జట్టులో ఆటగాళ్లెవరూ మంచి ఫామ్‌లో లేరని, దీంతో అక్కడ విజయాలు సాధించి చరిత్ర సృష్టించాలని భజ్జీ అశాభావం వ్యక్తం చేశాడు.
"టీమ్‌ఇండియాకు ఇది బంగారు అవకాశం. ఎందుకంటే ఇప్పుడు దక్షిణాఫ్రికా జట్టు ఇంతకుముందులా పటిష్ఠంగా లేదు. గత పర్యటనలోనూ ఏబీ డివిలియర్స్, డుప్లెసిస్ లాంటి ఆటగాళ్లు టీమ్‌ఇండియాను సిరీస్ గెలవకుండా అడ్డుకున్నారు. అక్కడ భారత జట్టు పలుమార్లు మంచి ప్రదర్శన చేసినా ఎప్పుడూ సిరీస్ నెగ్గలేదు. అక్కడ చరిత్ర సృష్టించడానికి ఇదే మంచి అవకాశం"
-హర్భజన్ సింగ్, టీమ్‌ఇండియా వెటరన్ స్పిన్నర్