తెలంగాణ

telangana

ETV Bharat / sports

Harbhajan Retirement: క్రికెట్​కు వీడ్కోలు పలికిన హర్భజన్ సింగ్ - హర్భజన్ సింగ్ ఐపీఎల్ టీమ్

harbhajan singh retirment
harbhajan singh

By

Published : Dec 24, 2021, 2:38 PM IST

Updated : Dec 25, 2021, 4:53 PM IST

14:32 December 24

ఆటకు వీడ్కోలు

Harbhajan Retirement: టీమ్ఇండియా సీనియర్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ క్రికెట్​కు వీడ్కోలు పలికాడు. చాలాకాలంగా జట్టులో చోటు కోసం ఎదురుచూసినా ఫలితం లేకపోవడం వల్ల ఆటకు రిటైర్మెంట్ ఇస్తున్నట్లు ప్రకటించాడు. ఎల్లవేళలా తనకు మద్దతుగా నిలిచిన అభిమానులు కృతజ్ఞతలు తెలిపాడు.

"ప్రతి మంచి పనికి ఏదో ఒక రోజు ముగింపు ఉంటుంది. నా జీవితానికి ఓ అర్థాన్నిచ్చిన ఆటకు ఈరోజు వీడ్కోలు పలుకుతున్నా. ఈ 23 ఏళ్ల ప్రయాణాన్ని ఎంతో అందంగా మార్చిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు" అంటూ ట్వీట్ ద్వారా తన రిటైర్మెంట్ ప్రకటించాడు భజ్జీ.

టీమ్​ఇండియా విజయాల్లో కీలకపాత్ర పోషించిన దిగ్గజ స్పిన్నర్లలో హర్భజన్ సింగ్ ఒకరు. కుంబ్లే తర్వాత జట్టుకు గొప్ప వరంగా మారాడు భజ్జీ. స్వదేశంతో పాటు విదేశాల్లోనూ జట్టును విజయంవైపు నడిపించాడు.

కెరీర్​లో తొలి టెస్టును అజారుద్దీన్ కెప్టెన్సీలో ఆడిన భజ్జీ.. చివరి టెస్టు మ్యాచ్​ విరాట్ కోహ్లీ సారథ్యంలో ఆడాడు. అలాగే టీ20 ప్రపంచకప్​-2016 తర్వాత మరో మ్యాచ్ ఆడలేదీ స్పిన్నర్. అనంతరం ఐపీఎల్​లో ధోనీ, రోహిత్ సారథ్యంలో చెన్నై, ముంబయి జట్లు విజేతగా నిలవడంలో తనవంతు పాత్ర పోషించాడు.

రెండో అత్యుత్తమ బౌలర్

అంతర్జాతీయ కెరీర్​లో టీమ్ఇండియా తరఫున అత్యధిక వికెట్లు సాధించిన జాబితాలో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు హర్భజన్. ఇతడు మొత్తంగా 711 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. 953 వికెట్లతో అనిల్ కుంబ్లే మొదటి స్థానంలో ఉన్నాడు. కపిల్ దేవ్ (687), రవి అశ్విన్ (638), జహీర్ ఖాన్ (597) మూడు, నాలుగు, ఐదు స్థానాల్లో ఉన్నారు.

టెస్టు కెరీర్ (1995-2015)

భజ్జీ తన టెస్టు కెరీర్​లో మొత్తం 103 మ్యాచ్​లు ఆడి 417 వికెట్లు సాధించాడు.

వన్డే కెరీర్ (1998-2015)

236 వన్డే మ్యాచ్​లు ఆడిన భజ్జీ 269 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు.

టీ20 కెరీర్ (2006-2016)

పదేళ్ల పాటు పొట్టి ఫార్మాట్​కు సేవలందించిన హర్భజన్.. తన కెరీర్​లో 28 మ్యాచ్​ల్లో 25 వికెట్లు దక్కించుకున్నాడు.

ఐపీఎల్ కెరీర్ (2008-2021)

జాతీయ జట్టులో చోటు లభించకపోయినా ఐపీఎల్​లో మాత్రం స్థిరమైన ప్రదర్శన చేస్తూ అభిమానుల్ని అలరించాడు హర్భజన్. ఈ లీగ్​లో మొత్తం 163 మ్యాచ్​ల్లో 150 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. గత సీజన్​లో కోల్​కతా నైట్​రైడర్స్​కు ఆడాడు భజ్జీ.

Last Updated : Dec 25, 2021, 4:53 PM IST

ABOUT THE AUTHOR

...view details