తెలంగాణ

telangana

ETV Bharat / sports

'నాకే అధికారం ఉంటే.. ఆ మాటల్ని వినిపిస్తా' - గంభీర్ వ్యాఖ్యలు

స్టంప్​ మైక్రోఫోన్(stump mic in cricket) ఆడియో వినే అంశంపై తన అభిప్రాయాన్ని తెలిపాడు టీమ్​ఇండియా మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్(Gambhir News). అధికారం ఉంటే.. మైదానంలో ఆటగాళ్ల మాటలను అందరికీ తప్పక వినిపించేలా చేస్తానని చెప్పాడు.

gambhir
గంభీర్

By

Published : Oct 8, 2021, 9:45 AM IST

ప్రసారదారులుగా తమకు స్టంప్‌ మైక్రోఫోన్‌ ఆడియో(Stump mic in cricket) వినే అవకాశముంటుందని టీమ్​ఇండియా మాజీ ఆటగాడు గౌతమ్ గంభీర్(Gambhir News) చెప్పాడు. కొన్నిసార్లు వారు వినే సంభాషణల ద్వారా ఆటగాడు లేదా సమూహం ఆలోచన ఎలా ఉందో అర్ధమవుతుందని వివరించాడు. "కొన్ని సంభాషణలు చాలా ఆసక్తికరంగా ఉంటాయి. కొన్ని రోజుల ముందు ముంబయి, రాజస్థాన్‌ మ్యాచ్‌ సందర్భంగా క్రికెట్‌ బంతికి ఎలా మెరుపు తెప్పించాలన్నదానిపై ఓ భారత యువ బౌలర్‌ ఆలోచనలు మా చెవిన పడ్డాయి. అతడి సహచరులు మాత్రం.. మెరుపు గురించి ఆలోచించకుండా మంచి లైన్‌ అండ్‌ లెంగ్త్​తో బౌలింగ్‌ చేయమని చెప్పారు" అని టీమ్​ఇండియా మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ తెలిపాడు.

"చిన్నప్పుడు జాన్‌ మెకన్రో ఎప్పుడు అరుస్తాడా, చైర్‌ అంపైర్‌పై ఎప్పుడు అసహనాన్ని ప్రదర్శిస్తాడా అని ఆసక్తిగా ఎదురుచూసేవాణ్ని. చైర్‌ అంపైర్‌ మైక్రోఫోన్​ ద్వారా అతడి మాటలు వినిపించేవి. స్టంప్‌ మైక్రోఫోన్లను ఆఫ్‌ చేయాలనే వాళ్లున్నారు. వాటి వల్ల ఆటగాళ్లు స్వేచ్ఛగా ఉండలేరన్నది వారి వాదన. కానీ నాకైతే అలా అనిపించట్లేదు. ఈతరం క్రికెటర్లు సామాజిక మాధ్యమాల్లో చాలా చురుగ్గా ఉంటున్నారు. ఎక్కువ మంది క్రికెటర్లు ఇటీవల తమ పోస్టుల ద్వారా లేదా స్టంప్‌ మైక్రోఫోన్ల ద్వారా అభిమానుల దృష్టిలో పడడాన్ని ఆస్వాదిస్తున్నారు."

-గౌతమ్ గంభీర్, మాజీ క్రికెటర్.

పైన్‌ 'బేబీ సిట్టింగ్‌' వ్యాఖ్యలు రిషభ్‌ పంత్‌ పేరు అందరి నోళ్లలో నానేలా చేశాయని గంభీర్ గుర్తుచేశాడు. తనకే అధికారం ఉంటే.. మైదానంలో ఆటగాళ్ల మాటలు అందరికీ వినిపించేలా చేస్తానని చెప్పుకొచ్చాడు.

ఇదీ చదవండి:

స్టేడియం​లో చెన్నై క్రికెటర్​​ లవ్​ ప్రపోజల్​

ABOUT THE AUTHOR

...view details