పాకిస్థాన్ మాజీ అంపైర్ అసద్ రవూఫ్(66) లాహోర్‌లో గుండెపోటుతో మృతి చెందారు. ఆయన మృతి పట్ల పలువురు క్రీడా ప్రముఖులు సంతాపం తెలుపుతన్నారు. రవూఫ్ మరణానికి పాక్ క్రికెట్ బోర్డ్ చీఫ్ రమీజ్ రాజా ట్విటర్‌లో సంతాపం తెలిపారు. 'రవూఫ్ మరణవార్త కలచివేసింది. ఆయన మంచి అంపైర్, హాస్యచతురత ఉన్న వ్యక్తి. ఆయన్ను చూస్తేనే నా మొహంపై చిరునవ్వు మెరుస్తుంది. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి' అని తన సంతాప సందేశంలో పేర్కొన్నారు. పాక్ మాజీ వికెట్ కీపర్ కమ్రాన్ అక్మల్ కూడా రవూఫ్ మరణం పట్ల విచారం వ్యక్తం చేశారు.
గుండెపోటుతో మాజీ అంపైర్ కన్నుమూత
పాకిస్థాన్ మాజీ అంపైర్ అసద్ రవూఫ్(66) లాహోర్‌లో గుండెపోటుతో కన్నుమూశారు. ఆయన మృతి పట్ల పలువురు క్రీడా ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు.
గుండెపోటుతో మాజీ అంపైర్ కన్నుమూత
అసద్ రవూఫ్ 2006-2013 వరకు ఐసీసీ ఎలైట్ ప్యానల్ అంపైర్‌గా పనిచేశారు. రవూఫ్ తొలిసారి 2000 సంవత్సరంలో వన్డేలకు, 2005 నుంచి టెస్ట్ మ్యాచ్‌లకు అంపైరింగ్ మొదలుపెట్టారు. కెరీర్‌లో మొత్తం 64 టెస్టులు, 139 వన్డేలు, 28 టీ20లు, 11 మహిళల టీ20 మ్యాచ్‌లకు అంపైరింగ్ చేశారు. వీటితో పాటు భారత్‌లో జరిగే టీ20 లీగ్ సహా పలు మ్యాచ్‌ల్లో అంపైరింగ్ బాధ్యతలు నిర్వహించారు.
ఇదీ చూడండి: సీనియర్ మహిళా క్రికెటర్ అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై