తెలంగాణ

telangana

ETV Bharat / sports

ప్రాణాపాయ స్థితిలో ప్రముఖ క్రికెటర్! - క్రిస్ కైర్నస్ తాజా వార్తలు

ప్రముఖ క్రికెట్ ఆల్​రౌండర్ క్రిస్ కైర్నస్(51) ఆరోగ్యం రోజురోజుకు క్షీణిస్తోంది. ప్రస్తుతం అతడిని లైఫ్ సపోర్ట్ సిస్టమ్​పై ఉంచి, చికిత్స అందిస్తున్నట్లు స్థానిక మీడియా తెలిపింది.

New Zealand all-rounder Chris Cairns
క్రిస్ కైర్నస్

By

Published : Aug 10, 2021, 5:19 PM IST

గుండె సంబంధిత వ్యాధితో గతవారం ఆస్పత్రిలో చేరిన కివీస్ మాజీ ఆల్​రౌండర్ క్రిస్ కైర్నస్​(51) ఆరోగ్యం మరింత క్షీణించింది. ప్రస్తుతం ఆయన ఆస్ట్రేలియాలోని కాన్​బెర్రాలో ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. క్రిస్​ను లైఫ్ సపోర్ట్ సిస్టమ్​పై ఉంచినట్లు స్థానిక మీడియా వెల్లడించింది.

1989-2006 మధ్యకాలంలో కైర్నస్.. 62 టెస్టులు, 215 వన్డేలు, రెండు టీ20లు ఆడాడు. టెస్టుల్లో 3,320 పరుగులు చేసి 218 వికెట్లు తీశాడు. వన్డేల్లో 4,950 పరుగులు చేసి 201 వికెట్లు పడగొట్టాడు.

ఇదీ చదవండి:టీ20 ప్రపంచకప్​ న్యూజిలాండ్ జట్టిదే.. టేలర్​కు నిరాశ

ABOUT THE AUTHOR

...view details