Former Cricketer Vinod Kambli: దేశంలో సైబర్ నేరాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. సామాన్య ప్రజల నుంచి సెలబ్రిటీల దాకా సైబర్ నేరగాళ్ల వలలో చిక్కుకుంటున్నారు. తాజాగా టీమ్ఇండియా మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీ కూడా ఈ జాబితాలో చేరారు.
ఏం జరిగిందంటే?
డిసెంబర్ 3న కేవైసీ (నో యువర్ కస్టమర్) పేరుతో ఓ వ్యక్తి కాంబ్లీకి కాల్ చేసి తాను బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ అని చెప్పాడు. కేవైసీ అప్డేట్ చేసుకోవాల్సందిగా కోరాడు. ఆ వ్యక్తి వివరాలు సరిగ్గా కనుక్కోకుండా అతడు పంపిన లింకులను క్లిక్ చేసి వివరాలను పంపారు కాంబ్లీ. అనంతరం అతడి బ్యాంకు ఖాతా నుంచి రూ.1.13 లక్షలు మాయం అయ్యాయి. తర్వాత అది మోసమని తెలుసుకున్న కాంబ్లీ ముంబయిలోని బాంద్రా పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీలుసు విచారణ జరుపుతున్నారు.